బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కరోనా ‘పాజిటివ్’లకూ హోం క్వారంటైన్..
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కరోనా పాజిటివ్ బాధితులను క్వారంటైన్ కు సంబంధించి బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కరోనా పాజిటివ్ బాధితులను క్వారంటైన్ కు సంబంధించి బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాజిటివ్‌గా తేలినా ఇంట్లోనే క్వారంటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పాజిటివ్‌గా తేలినవారు తమంత తాముగా క్వారంటైన్ చేసుకునే వీలుంటే వాటిని వినియోగించుకోవచ్చని, ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు.
కాగా.. లక్షలమందిని క్వారంటైన్ చేయలేమని, ప్రభుత్వానికి కొన్ని పరిమితులున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మమత తెలిపారు. సాధారణంగా కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించి ప్రాణాలను కబళింస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారికి సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరికీ వైరస్ సోకుతుంది. అందువల్లే కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే బాధితుడిని హుటాహుటిన క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వస్తే 14 రోజులపాటు క్వారంటైన్‌లోనే ఉంచి అప్పటికీ నెగెటివ్‌గానే తేలితే ఇంటికి పంపిస్తారు.
మరోవైపు.. ఒకవేళ పాజిటివ్ వస్తే అతడి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఐసోలేషన్ వార్డుకు తరలించి కానీ, లేదా క్వారంటైన్ సెంటర్లోనే ఉంచి కానీ చికిత్స అందిస్తారు. అయితే ప్రస్తుతం బెంగాల్ నిర్ణయంతో కరోనా బాధితులు వారి కుటుంబ సభ్యులకు చేరువగా ఉంటారు. నిబంధనలను సక్రమంగా పాటిస్తే బాధితులు కోలుకునే అవకాశమున్నా.. అజాగ్రత్తగా ఉంటే మాత్రం వారి కుటుంబం మొత్తం కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదు.
[svt-event date=”27/04/2020,7:22PM” class=”svt-cd-green” ]
#WATCH We have taken a decision, if a person is tested positive for #COVID19 and he has provision to isolate himself at his residence, the person can home quarantine himself. Lakhs & lakhs of people can’t be quarantined, govt has its own limit: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/nn8sHvodxY
— ANI (@ANI) April 27, 2020
[/svt-event]
Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు..



