కరోనా.. ఇండియా.. పెరిగిన కేసులు 28,380.. రీకవరీ రేటు 22 శాతం
దేశంలో తాజాగా 28,380 కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 872 కి పెరిగింది. రీకవరీ రేటు స్వల్పంగా పెరిగి 22 శాతమైందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 5,913 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 280 జిల్లాల్లో ఈ పద్నాలుగు రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, అలాగే 64 జిల్లాల్లో వారం రోజుల్లో ఒక్క ఇన్ఫెక్షన్ కేసు కూడా నమోదు కాలేదని ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ […]
దేశంలో తాజాగా 28,380 కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 872 కి పెరిగింది. రీకవరీ రేటు స్వల్పంగా పెరిగి 22 శాతమైందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 5,913 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 280 జిల్లాల్లో ఈ పద్నాలుగు రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, అలాగే 64 జిల్లాల్లో వారం రోజుల్లో ఒక్క ఇన్ఫెక్షన్ కేసు కూడా నమోదు కాలేదని ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే 28 రోజుల్లో 18 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. పొడిగించిన లాక్ డౌన్ కారణంగా రీకవరీ రేటు పెరుగుతోందని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ కూడా ఇవాళ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో లాక్ డౌన్ ని మే 3 తరువాత కూడా పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు, రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాలు క్రమేపీ ఆరెంజ్ ప్రాంతాలుగా.. ఆ తరువాత గ్రీన్ జోన్లుగా మారగలవన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.



