తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. పెరుగుతోన్న పాజిటివ్ కేసులు

| Edited By:

Aug 08, 2020 | 9:00 AM

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,513కి చేరింది. ఇక నిన్న 1091 మంది డిశ్చార్జ్ కాగా...

తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
Follow us on

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,513కి చేరింది. ఇక నిన్న 1091 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం ఇప్ప‌టివ‌ర‌కూ 53,239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 22,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గ‌డిచిన‌ 24 గంటల్లో క‌రోనాతో 14 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 615కి చేరింది.

జిల్లాల వారీగా నమోదైన క‌రోనా కేసుల వివ‌రాలుః అత్యధికంగా జీహెచ్ఎంసీలో 464, ఆదిలాబాద్‌లో 26, భ‌ద్రాద్రి 79, జ‌గిత్యాల 49. జ‌న‌గాం 18, భూపాల‌ప‌ల్లి 38, గ‌ద్వాల్‌ 95, రంగారెడ్డిలో 181, వరంగల్ అర్బన్ 187, మేడ్చల్ 138, కామారెడ్డి 76, కరీంనగర్ 101, ఖమ్మం 69, నిజామాబాద్ 74, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ 45, మెద‌క్ 14, ములుగు 20, నిర్మ‌ల్ 18, నారాయ‌ణ‌పేట 9, న‌ల్గొండ 61, రాజ‌న్న సిరిసిల్ల 78, సంగారెడ్డి 92, సిద్ధిపేట‌లో 63, సూర్య‌పేట‌లో 25, మంచిర్యాల 44, వికారాబాద్ 13, వ‌రంగ‌ల్ రూర‌ల్ 16, పెద్దపల్లి 84 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న క‌రోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య‌

48 గంట‌లు అన్నీ బంద్‌.. పుట్ట‌ప‌ర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

నేడు, రేపు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు