Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి.. గత 24 గంటల్లో..

తెలంగాణలో కోవిడ్(COVID-19)వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,484 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి ఒక్కరు మృతి చెందారు. ఇప్పటి వరకు..

Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి.. గత 24 గంటల్లో..

Updated on: Jan 30, 2022 | 9:07 PM

Telangana Covid 19 Cases today updates: తెలంగాణలో కోవిడ్(COVID-19)వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,484 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి ఒక్కరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా(CORONA) కేసుల సంఖ్య 7,61,050 కాగా, మరణాల సంఖ్య 4,086గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 7,18,241 ఉండగా, తాజాగా 4,207 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.38శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 38,723 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, ఇవాళ మొత్తం 65,263 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,20,38,448 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1045 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో మేడ్చెల్ జిల్లా ఉంది. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.

ఇవి కూడా చదవండి: Kitchen Hacks: దానిమ్మ గింజలు తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా తీయొచ్చు..