తెలంగాణలో లాక్ డౌన్ విధించినా.. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదు. కొత్తగా రాష్ట్రంలో 63,120 కరోనా పరీక్షలు నిర్వహించగా… 3,308 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనాతో పోరాడలేక మరో 21 మంది ప్రాణాలు విడిచారు. మరోవైపు కరోనా నుంచి కొత్తగా మరో 4,723 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 42,959 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 513 కరోనా కేసులు వెలుగుచూడగా.. ఖమ్మం జిల్లాలో 228, రంగారెడ్డి జిల్లాలో 226, మేడ్చల్ జిల్లాలో 203, కరీంనగర్ జిల్లాలో 161 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.44కోట్ల కరోనా టెస్టుల చేయగా.. 5,51,035మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. వీరిలో 5,04,970మంది కోలుకోగా.. 3106మంది కన్నుమూశారు. తెలంగాణలో రికవరీ రేటు 91.64శాతం ఉండగా.. డెత్ రేటు 0.56శాతంగా ఉంది.
కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న జూనియర్ డాక్టర్లు (జూడాలు) నిరసన బాట పడుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 26 వరకు నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. తమకు పెంచిన స్టైఫండ్, కొవిడ్ విధుల ప్రోత్సాహకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటామని వెల్లడించారు. ఈ నెల 26 తర్వాత విధులు బహిష్కరించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్లకు గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి జూనియర్ డాక్టర్లు నోటీసులు ఇచ్చారు.
Also Read: ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రా, యానాం ప్రాంత ప్రజలకు రాగల మూడు రోజుల వరకూ వాతావరణ సూచనలు