తమిళనాట కరోనా విళయ తాండవం.. చెన్నైలో నమోదైన కేసులు చూస్తే షాక్..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ముప్పై వేలకు పైగా కేసులు.. వెయ్యికి పైగా మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే వీటిలో.. ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా తమిళనాడులో మరిన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 161 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసులు 2,323కి చేరింది. అయితే దక్షిణాది […]

తమిళనాట కరోనా విళయ తాండవం.. చెన్నైలో నమోదైన కేసులు చూస్తే షాక్..

Edited By:

Updated on: Apr 30, 2020 | 8:54 PM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ముప్పై వేలకు పైగా కేసులు.. వెయ్యికి పైగా మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే వీటిలో.. ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా తమిళనాడులో మరిన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 161
కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసులు 2,323కి చేరింది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో.. తమిళనాడులోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరంలో కేసుల నమోదు ఎక్కువగా ఉంది. గురువారం నమోదైన 161 కరోనా పాజిటివ్ కేసుల్లో.. చెన్నైలోనే 138  నమోదు కావడం గమనార్హం. ఇక చెన్నై నగరం తర్వాత.. కోయంబత్తూరులో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు
సిద్ధమవుతోంది.