తమిళనాడులో విజృంభిస్తున్న మహమ్మారి.. 50వేల దిశగా..

| Edited By:

Jun 16, 2020 | 7:24 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.

తమిళనాడులో విజృంభిస్తున్న మహమ్మారి.. 50వేల దిశగా..
Follow us on

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా నమోదవుతున్న కేసులను చూస్తే.. మరో రెండు మూడు రోజుల్లో యాభై వేల మార్క్‌ను దాటేసేలా ఉంది. ఇప్పటికే 48 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 1,515 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 48,019కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 49 మంది మరణించారని.. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 528కి చేరింది. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో.. అత్యధికంగా చెన్నైలోనే నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ ఇప్పటి వరకు 34 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. గడిచిన 24 గంటల్లో 941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. దీంతో ఇప్పటి వరకు చెన్నైలో 34,245 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది ప్రభుత్వం.