
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 33 వేలుకు పైగా కేసులు నమోదు కాగా, 1,075 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వివిధ రాష్ట్రాల్లో ఈ మరణాలు సంభవించాయి.
అయితే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గానీ.. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, చండీఘర్, ఛతీస్‌గఢ్, గోవా, లడఖ్, మణిపూర్, మిజోరం, పాండిచ్చేరి, త్రిపుర, ఉత్తరాఖండ్‌లలో కరోనా కేసులు నమోదైనా మరణాలు చోటు చేసుకోలేదు. అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో మాత్రం అత్యధిక మరణాలు సంభవించాయి. ఇక మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటింది.
Read Also:
ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!
తెరపైకి మరో కొత్త పేరు.. కిమ్ వారసుడు ఆయనేనట.!
లాక్ డౌన్ బేఖాతర్.. గుంపులుగా సామూహిక ప్రార్ధనలు..
మే 3 తర్వాత లాక్ డౌన్ 3.0 ఖాయమేనా.?
కరోనా మాటున పాకిస్తాన్ భారీ కుట్ర.. భారత సైన్యానికి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..