హైదరాబాద్ పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సుధాకర్ రెడ్డి (43) కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నప్పటికీ సుధాకర్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడం కలవరపాటుకు గురిచేసింది. హైదరాబాద్‌లో ఇటీవల వివిధ రాజకీయ పార్టీలు సంఘాలు నిర్వహించిన ధర్నాలు, రాస్తారోకోలతో పాటు.. బోనాలు బందోబస్తు కోసం పోలీసు సిబ్బంది హాజరయ్యారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనసందేహంతో కలిసి తిరగాల్సి వచ్చింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. పలువురు పోలీసులు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం నగరంలో పది మందికి పైగా పోలీసులు కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. దీంతో పోలీసు శాఖలో కలవరం మొదలైంది.
కరోనా ప్రారంభం నుంచి వ్యాప్తి కట్టిడిలో పోలీసులు పోషిస్తోన్న పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రమాదకర పరిస్థితులు ఉన్న సమయంలో కూడా వారు బయటకు వచ్చి డ్యూటీలు చేశారు. ఈ క్రమంలో ఎంతోమంది వ్యాధి బారినపడ్డారు. అతికొద్ది మంది మాత్రమే చనిపోగా.. మిగతావారు వ్యాధిపై పోరాటం చేసి విజయవంతంగా కోలుకున్నారు. కాగా కరోనా కట్టడిలో భాగంగా విధుల్లో ఉండే పోలీసులు.. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ప్రమాదవశాత్తూ వైరస్ సోకినా ప్రాణాపాయం లేకుండా ఉండేందుకు తప్పనిసరిగా పోలీసులు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నారు.
Also Read: Vizag: పైనుంచి చూస్తే పక్కా పైనాపిల్ లోడే అనుకుంటారు.. లోపల చెక్ చేస్తే మైండ్ బ్లాంక్