
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వస్తే చాలు మాంసం దుకాణాల వద్ద రష్ పెరిగిపోతోంది. ఇక యధావిధిగా ఈరోజు కూడా నాన్ వెజ్ కోసం జనాలు రోడ్ల మీదకు వచ్చారు. షాపులన్నీ ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని చాలా షాపుల దగ్గర లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయి.. జనాలు భౌతిక దూరాన్ని పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మాస్క్‌లు కంపల్సరీ అన్నా కూడా కొందరు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు నాన్ వెజ్ షాపులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధిక ధరలకు అమ్మే దుకాణాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి చదవండి:
మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..
పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..
నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!
షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!
కరోనాకు సిగరెట్‌తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!