విషాదకర ఘటన: కన్నబిడ్డను తాకకుండానే కరోనాతో తల్లి మృతి..

యావత్ మానవజాతిని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక చోట్ల హృదయ విషాదకర సంఘటనలను చూడాల్సి వస్తోంది. ప్రపంచం నలుమూలల ప్రతి ఒక్కరూ కరోనా దెబ్బకి అల్లాడిపోతున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌లో చోటు చేసుకున్న ఓ విషాదకర ఘటన కంటి తడి పెట్టిస్తోంది. కన్న బిడ్డను కళ్లారా చూసుకుని అమ్మతనాన్ని ఆస్వాదించాలని పరితపించిన ఓ తల్లిని.. మాయదారి కరోనా అది జరగకుండానే ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఏడేళ్ల క్రితం ఫోజియా హనీఫ్(29), వాజీద్ అలీ దంపతులకు […]

విషాదకర ఘటన: కన్నబిడ్డను తాకకుండానే కరోనాతో తల్లి మృతి..
Follow us

|

Updated on: Apr 26, 2020 | 10:05 AM

యావత్ మానవజాతిని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక చోట్ల హృదయ విషాదకర సంఘటనలను చూడాల్సి వస్తోంది. ప్రపంచం నలుమూలల ప్రతి ఒక్కరూ కరోనా దెబ్బకి అల్లాడిపోతున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌లో చోటు చేసుకున్న ఓ విషాదకర ఘటన కంటి తడి పెట్టిస్తోంది. కన్న బిడ్డను కళ్లారా చూసుకుని అమ్మతనాన్ని ఆస్వాదించాలని పరితపించిన ఓ తల్లిని.. మాయదారి కరోనా అది జరగకుండానే ప్రాణాలు తీసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఏడేళ్ల క్రితం ఫోజియా హనీఫ్(29), వాజీద్ అలీ దంపతులకు వివాహమైంది. హనీఫ్‌కు గతేడాది ఓ బిడ్డ పుట్టి చనిపోగా.. రీసెంట్‌గా మళ్లీ గర్భం దాల్చింది. దీనితో దంపతులిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే అనుకోని విధంగా హనీఫ్‌కు కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళగా.. వారు కరోనా పరీక్షలు చేయడంతో.. దానిలో పాజిటివ్ తేలింది. అయితే వైరస్ లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ఆమెను ఇంటికి వెళ్లవచ్చునని చెప్పారు.

కానీ హనీఫ్‌కు ఇంటికి వెళ్లిన నాలుగు రోజులకే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దానితో భర్త ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి రికవరీ వార్డులో చేర్పించారు. ఇక ఏప్రిల్ 2న సర్జరీ చేసి బాబును బయటికి తీశారు. పసి బిడ్డకు రిస్క్‌ ఎందుకని డాక్టర్లు తల్లిని, బిడ్డను వేరువేరు చోట్లలో ఉంచారు. ఒక దశలో ఆమె కోలుకుంటుందన్న వైద్యులు భరోసా ఇచ్చారు. ఇక కరోనా కారణంగా పుట్టిన బిడ్డను హనీఫ్‌ చూడలేకపోవడంతో ఆమె భర్త చిన్నారి ఫోటోలను చూపించారు.

తన బిడ్డ ఫోటోలు చూసుకుని తెగ మురిసిపోయిన హనీఫ్‌ కరోనా నుంచి కోలుకున్నాక అమ్మతనాన్ని ఆస్వాదించాలని అనుకుంది. కానీ ఇంతలోనే పరిస్థితి తలక్రిందులు అయింది. ఆరోగ్యం విషమించడంతో ఆమెను ఐసీయూకు తరలించి.. వెంటిలేటర్‌పై ఉంచారు. ఇక అంతలోనే భర్తకి, ఆమె తండ్రికి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇచ్చి.. డాక్టర్లు ఐసీయూలోకి పంపించారు. ఆ తర్వాత ఏప్రిల్ 6న ఆమె వెంటిలేటర్‌ను ఆపేశారు. దీనితో తన కన్న బిడ్డను ఒక్కసారైనా తనివితీరా ఎత్తుకోవాలనుకున్న ఆ తల్లి మాయదారి కరోనా కారణంగా కన్నుమూసింది. ఇక బిడ్డ పుట్టిన ఆరు రోజులకే హనీఫ్‌ చనిపోవడంతో ఆ కుటుంబం చాలా కృంగిపోయింది. కాగా, చిన్నారికి కరోనా నెగటివ్ వచ్చినా.. వైద్యులు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!

షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!

కరోనాకు సిగరెట్‌తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!

Latest Articles