AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ మహానగరంలో దారుణం.. మొబైల్ ఫోన్ కోసం వ్యక్తిని చంపారు..!

సెల్‌ఫోన్ కోసం ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మహానగరంలో వెలుగులోకి వచ్చింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 65 వద్ద ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని నిందితులు.

Hyderabad: హైదరాబాద్ మహానగరంలో దారుణం.. మొబైల్ ఫోన్ కోసం వ్యక్తిని చంపారు..!
Hyderabad Crime
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: May 01, 2024 | 1:25 PM

Share

సెల్‌ఫోన్ కోసం ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మహానగరంలో వెలుగులోకి వచ్చింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 65 వద్ద ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని నిందితులు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై పిల్లర్ నెంబర్ 65 వద్దకు వచ్చారు. రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకుంటున్న సన ఉల్లా వద్దకు వచ్చి, సెల్‌ఫోన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సనావుల్లా ఇవ్వకపోవడంతో ప్రతిఘటించారు. మొబైల్ ఫోన్ ఎంతకీ ఇవ్వకపోవడంతో తమ వద్ద తెచ్చుకున్న కత్తితో సనావుల్లాపై పలుమార్లు దాడి తెగబడ్డారు దుండగులు. ఈ ఘటనలో ఛాతిపై ఎక్కువ గాయాలయ్యాయి. ఆ తర్వాత బాధితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న బాధితుడు సనా ఉల్లాను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యలు ధ్రువీకరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు గుడిమల్కాపూర్ పోలీసులు. అయితే ఆ గుర్తు తెలియని నిందితులు ఎవరు మొబైల్ కోసమే వీరి మధ్య ఘర్షణ జరిగిందా పాతకక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా