Brahmamudi, May 1st episode: అనామికకు అత్త చివాట్లు.. స్వప్న డాక్యుమెంట్స్ గోల..

ఈ రోజు బ్రహ్ముముడి సీరియల్‌లో.. అనామికను కొడుతుంది స్వప్న. నా చెల్లిని అరెస్ట్ చేయించినందుకు ఏమైనా చేయవచ్చు.. కానీ చెంప దెబ్బతో వదిలేస్తున్నా. ఇప్పుడు చెంప దెబ్బ కొట్టానని మళ్లీ నా చెల్లిని అరెస్ట్ చేయించాలి అనుకుంటున్నావేమో.. అది ఒక్కసారే అవకాశం ఇస్తుంది. రెండోసారి వెళ్తే.. గొంతు మీద కాలు పెట్టి తొక్కుతుంది. అసలే అది సీలి రాకాసి. ఒళ్లంతా చీరేస్తుంది జాగ్రత్త అని అనామికకు..

Brahmamudi, May 1st episode: అనామికకు అత్త చివాట్లు.. స్వప్న డాక్యుమెంట్స్ గోల..
Brahmamudi
Follow us

|

Updated on: May 01, 2024 | 12:43 PM

ఈ రోజు బ్రహ్ముముడి సీరియల్‌లో.. అనామికను కొడుతుంది స్వప్న. నా చెల్లిని అరెస్ట్ చేయించినందుకు ఏమైనా చేయవచ్చు.. కానీ చెంప దెబ్బతో వదిలేస్తున్నా. ఇప్పుడు చెంప దెబ్బ కొట్టానని మళ్లీ నా చెల్లిని అరెస్ట్ చేయించాలి అనుకుంటున్నావేమో.. అది ఒక్కసారే అవకాశం ఇస్తుంది. రెండోసారి వెళ్తే.. గొంతు మీద కాలు పెట్టి తొక్కుతుంది. అసలే అది సీలి రాకాసి. ఒళ్లంతా చీరేస్తుంది జాగ్రత్త అని అనామికకు వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఆ తర్వాత అప్పూకి ఫోన్ చేస్తాడు కళ్యాణ్. ఇంత జరిగిన తర్వాత కూడా నాకు ఫోన్ చేశావా అని అప్పూ అడుగుతుంది. గొడవ జరిగిందని ఫోన్ చేయడం మానేస్తే.. మనం తప్పు చేశామని అందరూ అనుకుంటారు. అప్పూ నేను కవితలు రాస్తానని, కనిపించడానికి సాఫ్ట్‌గా ఉంటానని, అందరూ అనుకుంటారు. కానీ నేను చాలా మొండి వాడిని. నన్ను రెచ్చగొడితే ఎవరు చెప్పినా వినను బాయ్ బ్రో అలాగే సారీ అని చెప్తాడు కళ్యాణ్. సరేలే నేను పడుకుంటా ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది అప్పూ.

అప్పూతో మాట్లాడిన కళ్యాణ్.. పాపం అనామిక..

అదంతా విన్న అనామిక.. నీకు ఇంత జరిగిన తర్వాత కూడా సిగ్గు లేదా? మళ్లీ దానితో మాట్లాడుతున్నావ్? అని అడుగుతుంది. మాట్లాడతాను.. ఏం చేస్తావ్? అప్పూ విషయంలో నేను ఎవరు చెప్పినా వినను. ఇన్నాళ్లూ నువ్వు పెంకితనంతో మాట్లాడుతున్నావ్.. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటావ్ అనుకున్నా. కానీ నువ్వు ఏం చేసినా మారవు. నేను మోసపోయాను. ఇప్పుడు నువ్వు చేసిన పనిని నీ మీద ప్రేమ చచ్చిపోయింది. జీవితంలో ఎప్పటికీ క్షమించను అని కళ్యాణ్ అంటాడు. ఎలా క్షమించవో చూస్తాను అని అనామిక అనుకుంటుంది.

రోడ్డు మీద పడితే ఎక్కడ ఉంటారు: రుద్రాణి

మరోవైపు కావ్య కిచెన్‌లో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి వచ్చి.. ఏంటి కావ్య ప్రశాంతంగా నీ పని చేసుకుంటున్నావా.. నీ బాధ్యత ఎక్కడ మర్చిపోయావో అని కంగారు పడుతున్నా. రాజ్ కి ఇచ్చిన గడువుకి ఇంకా రెండు రోజులు ఉంది కదా.. దాని గురించి ఏం ప్లాన్ చేసుకున్నావ్? అని తెలుసుకుందామని వచ్చా అని రుద్రాణి అంటే.. సరే ఏం చేయాలో మీరే చెప్పండి అని కావ్య అంటుంది. ఏముంది రాజ్ ఎలాగో నిజం చెప్పడు కాబట్టి.. బయట నువ్వే ఓ ఇల్లు చూసి పెట్టుకుంటే మంచిది కదా.. మీ ఆయనకు అభిమానం ఎక్కువ అత్తవారింటికి వెళ్లలేడు. నీకు పొగరెక్కువ.. అలాంటప్పుడు మీరు సడెన్ గా రోడ్డు మీద పడితే ఎక్కడ ఉంటారు చెప్పు? ముందుగా సలహా ఇస్తున్నా అని రుద్రాణి అంటుంది. దీంతో కావ్యకు బాగా కోపం వస్తుంది. మీరు చాలా ఆశ పడుతున్నట్టున్నారు. మీరు అనుకున్నట్టు ఏమీ జరగదులెండి. భర్త కోసం అత్తగారిని ఏంటి? ఆ దేవుడినే ఎదిరిస్తాను. మా ఆయన్ని ఇంటి గడప దాటకుండా ఆపుతాను. మీ నిజమైన ముఖాన్ని త్వరలోనే అందరి ముందూ బయట పెడతాను అని కావ్య అంటుంది. చూద్దాం అని రుద్రాణి అంటుంది.

ఇవి కూడా చదవండి

కావ్యకు దొరికిన ఆధారం..

ఇక తెల్లవారుతుంది. కావ్య మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఉన్నట్టుగా ఏవండీ అని పిలుస్తుంది. రాజ్ ఉలిక్కి పడి.. ఏంటి? అని అడుగుతాడు. ఈ మొక్కను మీరే నాటారా? అని కావ్య అంటే.. అవును అని రాజ్ అంటాడు. అయితే నాకు అర్థమూపోయిందిలే. ఈ మొక్క పక్కన పిల్ల మొక్క మొలిచికొచ్చింది. మీ పక్కన బాబు పుట్టుకొచ్చినట్టు అని కావ్య అంటే.. అటు తిరిగి ఇటు తిరిగి.. చివరికి మీరు అనుకున్నది అనకుండా ఉండరు కదా ఛీ అని రాజ్ వెళ్లి పోతాడు. ఇంతలో డ్రైవర్ రాజ్ కారును శుభ్రం చేస్తాడు. కారులోని పనికి రాని వాటిని, బొకేని పక్కన పడేస్తాడు. అది చూసి కావ్య అదేంటి? అని అడుగుతుంది. తెలీదు మేడమ్ అని అంటాడు. ఆ బొకే చూసి షాక్ అవుతుంది కావ్య. ఎందుకంటే దాని మీద “మై డియర్ కళావతి.. హ్యాపీ యానివర్సరీ” అని రాసి ఉంటుంది. అంటే ఆయన నాకు ఇది ఇవ్వడానికి తీసుకొచ్చారు. మరి మధ్యలో ఏం జరిగింది? ఏం జరిగినా ఆఫీస్‌లోనే ఏదో జరిగింది అదేంటో తెలుసుకుంటాను అని కావ్య వెళ్తుంది.

అనామికకు చివాట్లు పెట్టిన ధాన్య లక్ష్మి..

మరోవైపు.. అనామిక ఎదురు పడినా.. ధాన్య లక్ష్మి పట్టించుకోకుండా వెళ్తుంది. వెనకాలే అనామిక కూడా వెళ్తుంది. ఏంటి ఆంటీ కాఫీ కావాలా నేను పెట్టి ఇస్తాను అని అనామిక అంటే.. వద్దలే నేను కాఫీ అడిగి నిన్న టార్చర్ చేస్తున్నానని నా మీద కూడా ఏమైనా కేసు పెట్టినా చేస్తావ్ అని ధాన్యం వెటకారం చేస్తుంది. మరేం చేయమంటారు. ఆ అప్పూతో కలిసి మీ అబ్బాయి ఎంత అవమానించినా భరించమంటారా? ఇంట్లో కూర్చుని ఏడవమంటారా? అని అనామిక అంటే.. ఇదే ఇంట్లో నేను కూడా ఉన్నాను అనామిక. నిజంగా నీకు కష్టం వస్తే వదిలేస్తానా? కళ్యాణ్ కంటే నీకే విలువ ఇచ్చాను. మాట పడకుండా చూసుకున్నాను. కానీ నువ్వు నా కొడుకుని తీసుకెళ్లి జైలులో పెట్టించావ్. అందరి ముందూ మచ్చ వేశావ్. నా కొడుకు చాలా మంచివాడు అని ధాన్య లక్ష్మి అంటుంది. దీంతో అనామిక సారీ చెప్తుంది. అయినా ధాన్యం పట్టించుకోదు. ఛీ ఇదంతా ఆ రుద్రాణి ఆంటీ వల్లనే.. ఆవిడ సంగతి చెప్తాను అని అనుకుంటుంది అనామిక.

మాయమైన డాక్యుమెంట్స్..

ఈ సీన్ కట్ చేస్తే.. హాలులో కూర్చొన్న సీతారామయ్య దగ్గరకు వచ్చి.. రోడ్డు వైడింగ్ విషయంలో మన షాపింగ్ కాంప్లెక్స్ కి కూడా నోటీసు వచ్చింది. వెనక్కి జరపాలి అంటున్నారని చెప్తాడు సుభాష్. అలా ఎలా నోటీసు పంపిస్తారు. మనం రోడ్డు కోసం ప్లేస్ వదిలే కట్టించాం కదా.. నువ్వు కమిషనర్‌తో మాట్లాడావా అని అడుగుతాడు. చెప్పాను నాన్నా.. మళ్లీ కొలతలు వేస్తారట, డాక్యుమెంట్స్ కావాలి అని చెప్తాడు సుభాష్. అది విని రాహుల్, రుద్రాణిలు షాక్ అవుతారు. ఈలోపు స్వప్న డాక్యుమెంట్స్ కోసం లోపలికి వెళ్తుంది. అవి ఎక్కడా కనిపించవు. దీంతో స్వప్న కంగారు పడి మొత్తం వెతుకుతుంది. డాక్యుమెంట్స్ కనిపించకపోవడంతో.. కిందకు వెళ్లి లేవని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. నేను జాగ్రత్తగానే పెట్టాను. కానీ అవి అక్కడ లేవు. రాహుల్ నువ్వేమన్నా చూశావా అని అడుగుతుంది. ఏయ్ అవి అసలు నాకు చూపించావా అని రాహుల్ అడుగుతాడు. నీకు తెలీకుండా డాక్యుమెంట్స్ ఎలా మాయం అవుతాయి? నిజం చెప్పు? ఆ డాక్యుమెంట్స్ జాగ్రత్తగానే పెట్టావా? తాకట్టు పెట్టావా? అని అడుగుతుంది రుద్రాణి.

అయ్యో స్వప్న ఇరుక్కు పోతుందా..

ఇలాంటి దరిద్రపు గుట్టు ఆలోచనలన్నీ మీకే వస్తాయి. నాకేం అవసరం. నా ఖర్చులు పోగా మిగిలిన డబ్బును బ్యాంక్‌లోనే దాస్తున్నాను అని స్వప్న అంటే.. ఏమో తాకట్టు పెడితే కోట్లు వస్తాయి అనుకున్నావేమో అని రుద్రాణి అంటే.. ఈ తాకట్ట అనే ఆలోచన మీకెందుకు వస్తుంది? అసలు ఏం అవసరం నాకు? అని స్వప్న అంటుంది. సరే.. పేపర్స్ సంగతి ఏంటి? ఆ ప్రాపర్టీ ఏదో నా పేరున, నా కొడుకు పేరు మీద రాసి ఉంటే జాగ్రత్తగా చూసేవాళ్లం కదా అని రుద్రాణి అంటుంది. ఆ ఆస్తి స్వప్న కోసం మీ నాన్న రాశారు. మీకు అసలు ఆ ఆస్తిలో పైసా వాటా కూడా లేదని పెద్దావిడ అంటుంది. ఇక మళ్లీ డాక్యుమెంట్స్ వెతకడానికి వెళ్తుంది స్వప్న. ఈలోపు సేటును రమ్మని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.