భారతీయుడు రాక ఆ రోజునే.. 

TV9 Telugu

21 May 2024

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న కోలీవుడ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం భారతీయుడు 2.

హీరో సిద్దార్థ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. దీనిలో ఎస్.జె సూర్య కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కథానాయకి. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ హీరోయిన్. ప్రియా భవాని శంకర్ ముఖ్య భూమిక పోషిస్తుంది.

బ్రహ్మానందం, సముద్రఖని, మనోబాల, జాకీర్ హుస్సేన్ తిధితరులు ఈ సినిమాలో కొన్ని పాత్రల్లో కనిపించనున్నారు.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థల్లో సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రోమియో పిక్చర్స్ సంస్థ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.

కాగా ఈ చిత్రం జూలై నెలలో అన్ని థియేటర్లలో విడుదల కానుందని లోకనాయకుడు కమల్ హాసన్ ఇప్పటికే వెల్లడించారు.

తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. జూలై 12, 2024న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.