గంగం గణేష వచ్చేస్తున్నాడు..

TV9 Telugu

21 May 2024

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ కమర్షియల్ కథలు కాకుండా విభిన్నమైన దారిలో వెళ్తున్నారు.

ఆయన హీరోగా నటిస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా గంగం గణేష. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ సినిమా దర్శకుడు.

హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ సరసన తెలుగు అమ్మాయి ప్రగతి శ్రీవాస్తవ కథానాయకిగా గం గం గణేశా సినిమాలో నటిస్తుంది.

వెన్నల కిషోర్, సత్యం రాజేష్, రాజ్ అర్జున్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, ప్రిన్స్ యావర్, నయన్ సారిక ఇందులో కీలక పాత్రధారులు.

చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి స్వరాలూ సమకూరుస్తున్నారు. ఇప్పటీకే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ వేదికగా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది.