Watch Video: తెలంగాణలో పీక్‌కి చేరిన పొలిటికల్ హీట్.. మోదీ, కేసీఆర్, రేవంత్ మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్..

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్లతో తెలంగాణ దంగల్‌ నెక్ట్స్‌ లెవల్‌కి చేరింది. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డబులార్ ట్యాక్స్‌ కామెంట్స్‌ కాకరేపుతున్నాయి. రేవంత్, రాహుల్ గాంధీ ట్యాక్స్ అని అర్థమొచ్చేలా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Watch Video: తెలంగాణలో పీక్‌కి చేరిన పొలిటికల్ హీట్.. మోదీ, కేసీఆర్, రేవంత్ మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్..

|

Updated on: May 01, 2024 | 12:34 PM

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్లతో తెలంగాణ దంగల్‌ నెక్ట్స్‌ లెవల్‌కి చేరింది. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డబులార్ ట్యాక్స్‌ కామెంట్స్‌ కాకరేపుతున్నాయి. రేవంత్, రాహుల్ గాంధీ ట్యాక్స్ అని అర్థమొచ్చేలా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. డబులార్‌ ట్యాక్సే నిజమైతే రేవంత్‌ రెడ్డిపైకి ఐటీ, ఈడీని ఎందుకు పంపరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. పైకి నాటకాలు ఆడుతారుకానీ.. లోపలు వారు ఇద్దరూ ఒక్కటేనన్నారు. అయితే… మోదీ, కేసీఆర్‌ ఇద్దరికీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు రెండూ వేర్వేరు కావన్నారు. బీజేపీని గెలిపిందేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ ముగ్గురి మధ్య సాగిన హైవోల్టేజ్‌ డైలాగ్‌ వార్‌ను ఇప్పుడు చూద్దాం..

తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది.

Follow us