గుడ్‌న్యూస్ః రూ. వెయ్యికే క‌రోనా వ్యాక్సిన్ !

|

Apr 29, 2020 | 7:20 AM

దేశ ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్‌ను రూ. వెయ్యికే అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ప్ర‌ముఖ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అద‌ర్ పూనావాలా చెప్పారు. సెప్టెంబ‌ర్ ..

గుడ్‌న్యూస్ః రూ. వెయ్యికే క‌రోనా వ్యాక్సిన్ !
Follow us on
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. కోవిడ్ భ‌యంతో ప్ర‌జ‌లు గ‌డ‌ప‌దాట‌ని ప‌రిస్థితి నెల‌కొంది. మందులేని మ‌హ‌మ్మారిని అంతంచేసేందుకు ప్ర‌పంచ దేశాలు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాయి. ఇటువంటి త‌రుణంలో పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా వ్యాక్సిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్‌ను త్వ‌ర‌లో ప్రారంభిస్తున్న‌ట్లు చెప్పింది. ఈ క్ర‌మంలో చాలా త‌క్కువ ధ‌రకే క‌రోనా వ్యాక్సిన్‌ను అందిస్తామ‌ని ఆ సంస్థ తెలిపింది. అందుకు గాను ఇత‌ర మందుల త‌యారీని కూడా తాత్కాలికంగా నిలిపివేశామ‌ని ఆ కంపెనీ సీఈవో అద‌ర్ పూనావాలా వెల్ల‌డించారు.
దేశ ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్‌ను రూ. వెయ్యికే అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ప్ర‌ముఖ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అద‌ర్ పూనావాలా చెప్పారు. మొద‌టి ద‌శ‌లో నెల‌కు 10 మిలియ‌న్ల డోసుల‌ను సిద్ధం చేస్తామ‌న్నారు. త‌రువాత నెల‌కు 20 నుంచి 40 మిలియ‌న్ల డోసుల‌ను త‌యారు చేస్తామ‌న్నారు.  సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ నాటికి 2-4 కోట్ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని…వ‌చ్చే నెల‌లో మ‌నుషుల‌పై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. అటు బ్రిట‌న్‌లోని ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌ల ట్ర‌య‌ల్స్ కోసం వేచి చూడ‌బోమ‌న్నారు.