సికింద్రాబాద్ బ‌స్‌టెర్మిన‌ల్‌కు మ‌హార్ధ‌శ‌..రూ.30 కోట్ల‌తో..

|

Jun 19, 2020 | 2:14 PM

వంద‌ల ఏళ్ల చరిత్ర గ‌ల‌ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్నబస్‌టెర్మినల్స్‌కు త్వ‌ర‌లోనే మ‌హార్ధ‌శ రాబోతోంది. ఇక్కడికి రోజుకు కొన్నిలక్షల మంది ప్రయాణీకులు వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్‌టెర్మినల్స్‌ అభివృద్ది...

సికింద్రాబాద్ బ‌స్‌టెర్మిన‌ల్‌కు మ‌హార్ధ‌శ‌..రూ.30 కోట్ల‌తో..
Follow us on
వంద‌ల ఏళ్ల చరిత్ర గ‌ల‌ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్నబస్‌టెర్మినల్స్‌కు త్వ‌ర‌లోనే మ‌హార్ధ‌శ రాబోతోంది. ఇక్క‌డి బ‌స్‌ట‌ర్మిన‌ల్స్‌ని త్వ‌ర‌లోనే అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పేర్కొన్నారు. గురువారం మంత్రి త‌ల‌సాని సికింద్రాబాద్‌లోని బస్టాప్‌, ఫుట్‌పాత్‌లు ఇతరాత్ర‌ పలు అభివృద్ధిపనులు జరుగుతున్నతీరును పరిశీలించారు.
ఈసందర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ టెర్మిన‌ల్ బస్‌స్టాప్‌లను అందంగా తీర్చిదిద్దాలని ఇక్కడ ధీమ్‌పార్కులను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సంకల్పించారని తెలిపారు. ఇక్కడికి రోజుకు కొన్నిలక్షల మంది ప్రయాణీకులు వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్‌టెర్మినల్స్‌ అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేర‌కు రూ.30కోట్లతో  ఇక్క‌డ ప‌లు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వివ‌రించారు. జీహెచ్‌ఎంసి, ట్రాఫిక్‌, ఇతర శాఖల సమన్వయంతో వీటిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. కేటీఆర్‌ మున్సిపల్‌శాఖ మంత్రి అయ్యాక గ్రేటర్‌ హైదరాబాద్‌లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మంత్రి వెల్లడించారు. దేశమంతా కరోనా సంక్షోభం ఉంటే ఇక్కడ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసి లాక్‌డౌన్‌ పీరియడ్‌ను అద్భుతంగా వినియోగించుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు. లాక్‌డౌన్‌ ముగిశాక రోడ్లపైకి వచ్చిన జనం రోడ్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.