కరోనాపై యుద్ధానికి.. ఎస్బీఐ భారీ సాయం.. అంతేకాదు మరో సంచలన నిర్ణయం..!

| Edited By: Pardhasaradhi Peri

Apr 01, 2020 | 10:04 PM

కరోనా మహమ్మారిపై పోరుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు కూడా నడుం బిగించారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి సహాయ నిధికి దాదాపు వంద కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఉద్యోగులంతా వారి రెండు రోజుల విరాళాన్ని అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో మొత్తం 2.5లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరు ఇచ్చే రెండు రోజుల జీతం దాదపు రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు రోజుల జీతం […]

కరోనాపై యుద్ధానికి.. ఎస్బీఐ భారీ సాయం.. అంతేకాదు మరో సంచలన నిర్ణయం..!
Follow us on

కరోనా మహమ్మారిపై పోరుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు కూడా నడుం బిగించారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి సహాయ నిధికి దాదాపు వంద కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఉద్యోగులంతా వారి రెండు రోజుల విరాళాన్ని అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో మొత్తం 2.5లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరు ఇచ్చే రెండు రోజుల జీతం దాదపు రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు రోజుల జీతం విరాళంగా ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ చైర్మన్ రంజీష్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే పీఎం కేర్స్ ఫండ్‌కు కూడా ఎస్బీఐ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. బ్యాంకు ఏడాది లాభాల్లో 0.25శాతాన్ని పీఎం సహాయనిధికి అందిస్తామని కూడా హామీ ఇచ్చింది.