Rising Covid cases: పంజాబ్ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో వణికిపోతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కొత్తగా కొన్ని ఆంక్షలు విధించింది. మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్య నిపుణులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైరస్ కట్టడికి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో.. ఇళ్ల పరిసరాల్లో 100 మంది, బహిరంగ ప్రాంతాల్లో 200 వరకు మాత్రమే గుమిగూడేందుకు పరిమితి విధించారు. మార్చి 1వ తేదీ నుంచి ఇది అమలుల్లోకి వస్తుందని తెలిపారు. ప్రజలంతా విధిగా మాస్కులు ధరించేలా, భౌతికదూరం నిబంధన పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కరోనా పరీక్షల సంఖ్యను రోజుకు 30 వేలకు పెంచాలని సూచించారు. అవసరం అనుకుంటే హాట్‌స్పాట్లలో కఠిన కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. ఇదిలాఉండగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్య సిబ్బందికి క్వారంటైన్ సెలవులు మంజూరు చేయబోమని, వైద్య ఖర్చులు సైతం వారే భరించుకోవాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్ సింగ్ సింధు వెల్లడించింన సంగతి తెలిసిందే.
Uttarakhand Flash Floods: ఇక ఇందులో ఎవరూ బతికిలేరట..! ధౌలిగంగా ప్రళయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
India vs England: ఓ అద్భుతం.. ఓ వీక్షణం.. మొతెరా స్టేడియంలో ఎన్నో ప్రత్యేకతలు.. ఓ సారి చూద్దాం..