Corona Vaccination: కరోనా సెకండ్ వేవ్ ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తేనే ఉంది. దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగానే ఉంది. ఇలాంటి విపత్కర సమయంలో కరోనా నుంచి మనల్ని బయటపడేసేది కేవలం వ్యాక్సిన్ ఒక్కటే. వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువ ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చిచెప్పాయి. అయితే చాలా మందిలో ఇప్పటికీ వ్యాక్సినేషన్‌పై కొంతమేర అనుమానాలున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయోమోనని భయంలో ఉన్నారు. దీంతో ప్రభుత్వాల నుంచి సెలబ్రిటీల వరకు ప్రజల్లో వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థ రియలన్స్ వినూత్న ఆలోచన చేసింది. వ్యాక్సిన్ చేయించుకున్న వారు రిలయన్స్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే డిస్కౌంట్ అందిస్తోంది. కొత్త పాలసీ తీసుకున్నా.. రెనివల్ చేయించుకున్నా 5 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. ప్రజల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కరోనా మహమ్మారిని అదుపు చేయాలంటే అందరూ కలిసి పోరాడాలని రిలయన్స్ ఇన్సూరెన్స్ సీఈఓ రాకేశ్ జేయిన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలసీలపై ఇది వరకు ఉన్న ఆఫర్లతో పాటు మరో 5 శాతం అందించనున్నామని తెలిపారు. కొత్త పాలసీలతో పాటు, రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ ఆఫర్ అందించనున్నారు. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని రాకేశ్ చెప్పుకొచ్చారు.
Also Read: CM KCR Health Corona: కరోనాను జయించిన సీఎం కేసీఆర్.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్న వైద్యులు..