కరోనా మహమ్మారి నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూత పడ్డాయి. దీంతో చాలా సినిమాలు విడుదల ఆగిపోయాయి. మరోవైపు మధ్యలోనే మరికొన్ని చిత్రాల షూటింగులు నిలిచిపోయాయి. ఇక చాలా సినిమాలని ఓటీటీలో విడుదల చేస్తున్నారు దర్మక నిర్మాతలు. పైగా ఓటీటీ ప్లేయర్స్ మంచి రేటును కూడా ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం నాని సినిమా ‘వి’ కూడా సెప్టెంబర్ 5న ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. తాజాగా రామ్ కొత్త చిత్రం ‘రెడ్’ డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లో విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటుండగా.. రామ్ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీగా లేడని టాక్ వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తన సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలని అంటున్నాడట. దసరా సీజన్‌లో థియేటర్లు ఓపెన్ అవ్వనున్నట్టు వార్తలు వస్తూండటంతో.. రామ్ చిత్రం కూడా అదే టైంలో రానుందని తెలుస్తోంది.
Read More:
సోనూ భాయ్ నాకూ సాయం చేయ్.. బ్రహ్మాజీ ట్వీట్
రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలుః సీఎం జగన్