
ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మందుండే రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపబోతున్నాడు. లాక్‌డౌన్ సమయంలో అంతా ఇంటికే పరమితమైతే… తాను మాత్రం ఏకంగా సినిమాలు తీసి రిలీజ్ చేశారు. ఇటీవల క్లైమాక్స్ అనే చిత్రాన్ని తన సొంత యూటూబ్ ఛానల్‌లో విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో చిత్రం తీయబోతున్నట్లుగా వెల్లడించారు. “the man who killed Gandhi” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో ఓ వైపు నాథూరామ్ గాడ్సే… మరోవైపు గాంధీ ఫేసులు ఉండేట్లుగా “అర్థనాథూరామ్‌గాంధీ”గా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇది ఎంత వివాదాస్పద చిత్రంగా మారుతుందో వేచి చూడాలి. వర్మ అంటేనే… వివాదం… వివాదం అంటేనే వర్మ..
Because of it’s humongous success on my personal platform, I consider CLIMAX as the BEGINNING of my CAREER..just WAIT and WATCH what kind of PATHBREAKING content I will keep on putting on RgvWorldTheatre pic.twitter.com/kwIiDNWKLz
— Ram Gopal Varma (@RGVzoomin) June 10, 2020