
ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు మిలయన్ల పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మన దేశంలో కూడా పన్నెండు వేల మందికి పైగా కరోనా సోకగా.. నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ క్రమంలో దేశంలో వైరస్ నియంత్రణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇక కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా అనేకమంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు పీఎం సహాయ నిధులకు, సీఎం సహాయ నిధులకు విరాళాలు అందిస్తున్నారు. సామాన్యుల నుంచి మొదలుపెడితే.. కోటీశ్వరుల వరకు ఈ కరోనా మహమ్మారి కట్టడికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా యూపీకి చెందిన ఖైదీలు కూడా కరోనా కట్టడిలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. సీఎం సహాయనిధికి రూ. 2.3 లక్షల విరాళం అందించారు. వెస్ట్ యూపీ ప్రాంతంలో ఉన్న ఐదు జైళ్లకు చెందిన దాదాపు 500 మందికి పైగా ఖైదీలు.. వారు జైల్లో ఉండి సంపాదించిన సొమ్మును.. యూపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. ఇందులో.. ఘాజియాబాద్ జైలు ఖైదీలు రూ. 84,600 విరాళమిచ్చారు. ఇక మీరట్‌కు చెందిన జైలు ఖైదీలు రూ.81,700 ఇవ్వగా.. ముజఫర్‌నగర్‌కు చెందిన జైలు ఖైదీలు రూ. 28 వేలు విరాళం అందించారు. మరోవైపు.. పలు జైళ్లలో ఖైదీలు.. మాస్కులు తయారు చేస్తూ.. సామాన్య జనానికి అందిస్తున్నారు.