PRESSURE ON CHINA: చైనాపై పెరుగుతున్న ఒత్తిడి.. వైరస్ మూలాలను, వూహన్ ల్యాబును అప్పగించాలంటున్న వెస్టర్న్ మీడియా

|

Jun 02, 2021 | 2:28 PM

చైనాపై ఒత్తిడి పెరుగుతోంది. అంతర్జాతీయ సమాజం, పాశ్చాత్య మీడియా చైనాపై క్రమంగా ఒత్తిడి పెంచుతున్నాయి. కరోనా వైరస్ మూలాలను వెలికి తీసేందుకు చైనా దగ్గర వైరస్‌కు సంబంధించి వున్న మూలాలను…

PRESSURE ON CHINA: చైనాపై పెరుగుతున్న ఒత్తిడి.. వైరస్ మూలాలను, వూహన్ ల్యాబును అప్పగించాలంటున్న వెస్టర్న్ మీడియా
Follow us on

PRESSURE ON CHINA INCREASING DAY BY DAY: చైనాపై ఒత్తిడి పెరుగుతోంది. అంతర్జాతీయ సమాజం, పాశ్చాత్య మీడియా చైనాపై క్రమంగా ఒత్తిడి పెంచుతున్నాయి. కరోనా వైరస్ (CORONA VIRUS) మూలాలను వెలికి తీసేందుకు చైనా దగ్గర వైరస్‌కు సంబంధించి వున్న మూలాలను, వూహన్ ల్యాబు (WUHAN LAB) పూర్వాపరాలను, రికార్డులను బహిర్గతం చేయాలని అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా అమెరికా (AMERICA), యూరప్ దేశాలు (EUROPEAN COUNTRIES) డిమాండ్ చేస్తున్నాయి. వైరస్ సహజంగా ఉద్భవించినది కాదని, చైనీస్ ల్యాబుల్లో తయారైందేనని పలువురు యూరప్ (EUROPE), అమెరికన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడిన నేపథ్యంలో చైనాపై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా వైరస్ భౌతిక నిర్మాణాన్ని పరిశీలించిన యూరప్ సైంటిస్టులు దాని స్వరూపం సహజ సిద్దంగా లేదని, కృత్రిమమైనదేనని గట్టిగా వాదించారు. మరో ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈక్రమంలో వెస్టర్న్ మీడియా డ్రాగన్ కంట్రీపై ఒత్తిడి పెంచే కథనాలను పెద్ద ఎత్తున ప్రచురిస్తోంది.

2019 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే కరోనా వైరస్ వూహన్ ల్యాబు నుంచి లీక్ అయ్యిందని, అది డ్రాగన్ కుట్రేనని 2020 ఏప్రిల్ నెలలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (DONALD TRUMP) ఆరోపించారు. మరో అడుగు ముందుకేసి కరోనాను చైనీస్ వైరస్ (CHINESE VIRUS) అని కూడా వ్యాఖ్యానించారు. సరిగ్గా ఏడాది తర్వాత వివిధ పరిశోధనల్లో ఇదే అంశం నిర్ధారణ అవుతున్న సంకేతాలు కనిపిస్తోంది. ఆనాడు ట్రంప్ ఆరోపణలు చైనీస్ పాలకులు ఖండించారు. అదేరకంగా ఇప్పుడు అమెరికన్, యూరప్ సైంటిస్టుల అభిప్రాయాలను కొట్టిపడేస్తున్నారు. జంతువులు, పక్షుల ద్వారా ఉత్పన్నమయ్యే వైరస్‌లు, బ్యాక్టీరియాలు మానవులకు సోకడాన్ని స్పిల్ ఓవర్ అని అంటారు. ఈ స్పిల్ ఓవర్ సంఘటనలు మనకు సాధారణంగా జ్వరంగాను, అంతకంటే తీవ్రమైన లక్షణాలుగాను బహిర్గతమవుతాయి. అయితే.. ఈరకంగా సంక్రమించే అనారోగ్యాన్ని అంటురోగంగా భావించరు. అంటే సాధారణంగా మనిషి నుంచి మనిషికి ఇవి సంక్రమించవు.

కరోనావైరస్ గబ్బిలాల నుంచి ఉత్పన్నమైనప్పటికీ అది అదే రకంగా వుంటే మనుషులకు సోకడం సాధ్యం కాదని యూరప్ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అదే వైరస్ జన్యు స్వభావాన్ని మారిస్తే అది మరింత ప్రమాదకరంగా మారి.. మానవులకు సోకడమే కాకుండా అంటువ్యాధిగా మారి.. మనుషుల నుంచి మనుషులకు పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. సరిగ్గా చైనీస్ వూహన్ ల్యాబ్‌లో అక్కడి వైరాలజిస్టులు ఇలాంటి ప్రయోగాలను చేయడం వల్లనే కరోనా వైరస్ ప్రమాదకరంగా మారిందని, ఆ ల్యాబు నుంచి లీకైన తర్వాత శరవేగంగా ప్రపంచ దేశాలకు పాకిందని అమెరికా, యూరప్ దేశాల సైంటిస్టులు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు వైరస్‌లపై రకరకాల పరిశోధనలు నిర్వహించారు. ఇటువంటి పరిశోధనలు వైరస్‌లపై ప్రాథమిక జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. వ్యాధితో పోరాడటానికి అవగాహన కల్పిస్తాయి. దాన్ని నివారించే సాధనాలను కూడా సూచిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అంటు వ్యాధులపై చేసిన భారీ పనితో పోలిస్తే ల్యాబ్-లీక్‌లు చాలా అరుదు. ఒకవేళ లీక్ అయినా కూడా ప్రపంచానికి పెద్దగా తెలియవు. మశూచి వైరస్ యూకేలోని ఒక ల్యాబ్ నుండి లీక్ అయ్యింది. ఆంత్రాక్స్ మరియు SARS-1 వంటివి అమెరికన్ ల్యాబుల నుంచి లీక్ అయ్యాయి. వైరస్‌కు వుండే సహజ స్పిల్ఓవర్ తర్వాత కొన్ని ల్యాబ్ లీకేజీలు జరిగే అవకాశం వుంది.

Sars-CoV2 ఒక ల్యాబ్-లీక్ అవడం ద్వారా ప్రపంచానికి పెను ప్రమాదంగా మారిందన్న సందేహాలు బలపడుతున్నాయి. వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రపంచంలోని అగ్రశ్రేణి వైరాలజీ ప్రయోగశాలలలో ఒకటి. కరోనా వైరస్లపై పరిశోధనలు అక్కడ జోరుగా జరుగుతున్నాయి. మానవ కణాలకు లేదా వైరస్ కోసం ‘హ్యూమనైజ్డ్’ రిసెప్టర్ కలిగిన ఎలుకలపై దాని అంటువ్యాధిని పెంచడానికి కరోనావైరస్ యొక్క సంస్కృతి అనేది ఒక రకమైన పరిశోధనగా చెబుతున్నారు. రెండు సిద్ధాంతాలు సరైనవి అనే సాపేక్ష సంభావ్యతపై అంతర్జాతీయ జర్నల్స్ ఎన్నో సాంకేతిక చర్చల ఆధారంగా కథనాలను ప్రచురించాయి. జంతువుల నుండి మానవునికి స్పిల్‌ఓవర్ చెల్లుబాటు అయితే, అడవి గబ్బిలాలే వాటికి మూలమై ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వూహన్‌ ల్యాబుకు చేరిన మొదటి దశ కరోనా వైరస్‌కు మానవులకు సోకే స్థాయి వుండదని, ల్యాబులో దానిపై పరిశోధనలు జరిగిన తర్వాతనే అది మానవులకు సోకే స్థాయికి మ్యూటెంట్ అయ్యిందని యూరప్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ల్యాబ్-లీక్ సిద్ధాంతానికి ఆధారాలు పొందడానికి వైరస్ యొక్క జన్యు శ్రేణిని లేదా WIV వద్ద నిర్వహించిన ప్రయోగాలను చూడటానికి ప్రయత్నిస్తారు. వైల్డ్ స్పిల్‌ఓవర్ సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడానికి సందర్భోచిత సాక్ష్యాలు ఉన్నట్లే, ల్యాబ్-లీక్ సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడానికి సందర్భోచిత ఆధారాలు ఉన్నాయి.

సాధారణంగా, చాలా పార్సిమోనియస్ వివరణ అడవి స్పిల్‌ఓవర్‌కు మద్దతు ఇస్తుంది. కానీ, కరోనా వైరస్‌కు సంబంధించిన వివరాలను వూహన్ ల్యాబు అథారిటీగాను, చైనీస్ ప్రభుత్వాధినేతలు గానీ వివరించాల్సి వుందని పలు దేశాలు వాదిస్తున్నాయి. వూహన్ ల్యాబు.. తమ పరిశోధనాల నివేదికలను ప్రపంచ ఆరోగ్య సంస్థ టాస్క్‌ఫోర్సుకు అందచేస్తే.. కరనా వైరస్ పుట్టుక గురించి ప్రపంచానికి నిజాలు తెలిసే అవకాశం వుంది. కానీ ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా ఎలాంటి సమాచారాన్ని అందజేయలేదు. కుంటి సాకులతో చైనా తప్పించుకోవడం కూడా మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దాంతో ప్రపంచ దేశాలు ఒక్కొక్కటే చైనాపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ALSO READ: బ్రేక్ ఫాస్ట్ బిల్లులను తిరిగి చెల్లించనున్న ప్రధాని.. ఆరోపణలతో వెనక్కి తగ్గిన సన్నా మారిన్