
యూపీలో దారుణం చోటుచేసుకుంది. అలీగఢ్‌లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. పోలీసులపైకి రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. అలీగఢ్‌లోని భుజ్‌పురాలో ఉదయం 6.00 గంటల నుంచి 10.00 గంటల వరకు షాపులు తెరుచుకునేందుకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే 10.00 గంటలు దాటిన
తర్వాత షాపులను మూసేయాలంటూ పోలీసులు దుకాణాదారులను కోరారు. ఈ క్రమంలో పోలీసులు, షాపు యజమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఇదే సమయంలో అక్కడ ఉన్న అల్లరిమూకలు పోలీసులపైకి రాళ్ల దాడులకు దిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పోలీసులపై దాడిని యోగీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఘటనాస్థలికి అదనపు బలగాలను పంపించి పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. భుజ్‌పురా మార్కెట్‌లో షాపులు నడుపుతున్న యజమానులంతా అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు కరోనా కట్టడిలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఇలా దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు కరోనా కట్టడిలో తాము చేస్తున్న సేవలను అర్ధం చేసుకోవాలని పోలీసులు ప్రజల్ని కోరుతున్నారు.