కరోనాపై పోరులో మనదే విజయం.. ప్రధాని మోదీ

కరోనాపై పోరులో మనదే విజయమవుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. మనకు ఈ ఒక్క సమస్యే కాదని, వరదలు, వడగండ్ల వానలు, రెండు తుపానులు, చిన్న చిన్న భూప్రకంపనలు, చమురు బావుల్లో మంటల వంటి ప్రకృతి వైపరీత్యాలతో కూడా మనం పోరాడుతున్నామని అన్నారు . ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95 వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇండియా స్వావలంబన (ఆత్మ నిర్భర్) కావాల్సిందే అన్నారు. స్థానిక ఉత్పత్తులు, బిజినెస్ లపై మనం దృష్టి పెట్టాల్సి ఉందని, […]

కరోనాపై పోరులో మనదే విజయం.. ప్రధాని మోదీ

Edited By:

Updated on: Jun 11, 2020 | 12:32 PM

కరోనాపై పోరులో మనదే విజయమవుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. మనకు ఈ ఒక్క సమస్యే కాదని, వరదలు, వడగండ్ల వానలు, రెండు తుపానులు, చిన్న చిన్న భూప్రకంపనలు, చమురు బావుల్లో మంటల వంటి ప్రకృతి వైపరీత్యాలతో కూడా మనం పోరాడుతున్నామని అన్నారు . ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95 వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇండియా స్వావలంబన (ఆత్మ నిర్భర్) కావాల్సిందే అన్నారు. స్థానిక ఉత్పత్తులు, బిజినెస్ లపై మనం దృష్టి పెట్టాల్సి ఉందని, కోవిడ్-19 అనంతరం.. లోకల్ మాన్యుఫాక్చరింగ్ అన్నదే మన నినాదం కావాలని ఆయన పిలుపునిచ్చారు.  మనకు ఉన్న వనరులనన్నీ వినియోగించుకోవలసిన అవకాశం మనకు ఉన్నప్పుడు ఆత్మ నిర్భర దేశం ఎందుకు ఆవిష్కరించదని ప్రశ్నించారు. మన దేశం ప్లాస్టిక్ రహిత దేశం కావాలని కూడా ఆయన సూచించారు. ఇండస్ట్రీ..రైతులు మమేకం కావాలన్నారు.

‘మనం తప్పనిసరిగా దిగుమతి చేసుకునే వస్తువులను మనమే దేశంలో ఉత్పత్తి చేసుకుని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి.. స్వావలంబన లక్ష్యం ఇదే అని మోదీ పేర్కొన్నారు. ‘ప్రజలు-ఈ భూగ్రహం-లాభం.. (పీపుల్, ప్లానెట్, ప్రాఫిట్) ఎప్పుడూ కలిసే ఉంటాయి.. వీటిని మనం విడదీయలేం అని ఆయన వ్యాఖ్యానించారు.

మనం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలను  అవకాశంగా మార్చుకోవాలని, ఇదే టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన కోరారు. ఈ దేశాన్ని ఆత్మ నిర్భర్ దేశంగా మలుచుకునేందుకు కరోనా మనకు అవకాశం ఇచ్చిందన్నారు. భారతీయుల దృఢచిత్తం, మన బలమే అన్ని సమస్యలకు పెద్ద పరిష్కారం కాగలదని ఆయన చెప్పారు. బెంగాల్ లోని ఇండస్ట్రీ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఎక్కువగా ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. కోల్ కతా పెద్ద లీడర్ కావచ్ఛు.. బెంగాల్ ఈ రోజు ఆలోచిస్తున్నదానినే దేశం రేపు ఆలోచిస్తుంది అని కూడా అన్నారు.