PM Modi: ముఖ్యమంత్రులతో గురువారం ప్రధాని మోడీ సమావేశం.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ..

|

Jan 12, 2022 | 10:18 PM

దేశ వ్యాప్తి కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు.

PM Modi: ముఖ్యమంత్రులతో గురువారం ప్రధాని మోడీ సమావేశం.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ..
Modi
Follow us on

దేశ వ్యాప్తి కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం నాలుగున్నరకు ఈ సమావేశం జరగనుంది. దేశంలో కోవిడ్ పరిస్థితిపై చర్చిస్తారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తమిళనాడులో ఆదివారాలు లాక్‌డౌన్ కొనసాగుతోంది.

కరోనా కాలంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలైన వారు కొందరైతే.. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారు మరి కొందరున్నారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా, తిండిలేక ఎన్నో కష్టాలను పడ్డారు. అదే అదనుగా భావించి కొందరు మోసగాళ్లు జనాలను బురిడికొట్టిస్తున్నారు. జనాలను కొత్త కొత్త పద్దతుల్లో మోసగిస్తున్నారు. మోసగాళ్లు బ్యాంకు ఖాతాలపై కన్నెసి ఖాతాలో ఉన్న డబ్బులన్ని తస్కరిస్తున్నారు.

వెలుగులోకి వచ్చిన కొత్తరకం మోసం

కరోనా సమయంలో మోసగాళ్లు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. కోవిడ్‌ పేరుతో జనాలను బురిడి కొట్టిస్తున్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ అంశం వైరల్‌ అయ్యింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోవిడ్‌ ఫండ్స్‌ నుంచిరూ.5వేలు అందిస్తోందని కొందరు సోషల్‌ మీడియాలో మెసేజ్‌లను వైరల్‌ చేస్తున్నారు. దీనికి ఆ ఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 15వ తేదీ చివరి గడువు అని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఇలాంటి మెసేజ్‌లను, లింక్‌లను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ జనాలను మోసగిస్తున్నారు మోసగాళ్లు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కీమ్‌ తీసుకురాలేదు. మోసగాళ్లు సోషల్‌ మీడియాలో ఈ స్కీమ్‌ పేరుతో లింక్‌లను పెడుతూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

 ఇవి కూడా చదవండి: Viral Video: పాముతో గేమ్సా.. క్షణాల్లో కాటేసింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!