కరోనా మరణ మృదంగం.. ఈ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం

కరోనా వల్ల దేశంలో తలెత్తిన పరిస్థితిపై ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ట్వీట్ చెసిన ఆయన.. ప్రజలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉండాలని కోరారు. అయితే ఆందోళన చెందవద్దని, ఈ మహమ్మారి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని, ప్రజలు బయట తిరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని మోదీ అన్నారు. ఈ నెల 19 న […]

కరోనా మరణ  మృదంగం.. ఈ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం

Edited By:

Updated on: Mar 24, 2020 | 4:19 PM

కరోనా వల్ల దేశంలో తలెత్తిన పరిస్థితిపై ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ట్వీట్ చెసిన ఆయన.. ప్రజలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉండాలని కోరారు. అయితే ఆందోళన చెందవద్దని, ఈ మహమ్మారి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని, ప్రజలు బయట తిరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని మోదీ అన్నారు. ఈ నెల 19 న మొదటిసారిగా దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. కరోనావంటి ముప్పును మనం ఎన్నడూ ఎదుర్కోలేదని, మొదటి ప్రపంచ యుధ్ధ సమయంలో సైతం అనేక దేశాలు ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోలేదని ఆయన పేర్కొన్నారు. వరల్డ్ లో పలు ధనిక దేశాలకు కోవిడ్-19 ముప్పు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇండియాలో దీని తీవ్రత తక్కువగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.