స్థానిక ఉత్ప‌త్తుల్లే..జీవ‌న మంత్రం కావాలిః మోదీ

స్థానిక ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు ప్ర‌ధాని మోదీ. చేనేత, ఖాదీ వస్త్రాలకు

స్థానిక ఉత్ప‌త్తుల్లే..జీవ‌న మంత్రం కావాలిః మోదీ

Updated on: May 13, 2020 | 6:57 AM

కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు సాగాలని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చారు. ఇకపై మన విశ్లేషణలన్నీ కరోనా ముందు కరోనా తర్వాత అనే ఉంటాయన్నారు. భారత్ లో కూడా అనేక మంది అయినవారిని కోల్పోయారు. ఒకే ఒక్క వైరస్‌ ప్రపంచాన్ని తలకిందులు చేసిందంటూ..జాతి నుద్దేశించి ప్రసంగించిన ప్ర‌ధాని మోదీ లోకల్‌ బ్రాండ్లకు విశేష ప్రజాదరణ కల్పించాలన్నారు. ఇది మన ఉత్పత్తి అన్న భావన కలిగేలా చేయాలన్నారు.
స్థానిక ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు ప్ర‌ధాని మోదీ. చేనేత, ఖాదీ వస్త్రాలకు ఇప్పుడు ఉన్న డిమాండ్‌ను ఆయన గుర్తు చేశారు. లోకల్‌ బ్రాండ్లనే జీవన మంత్రంగా చేసుకోవాలన్నారు. ఇప్పుడు గ్లోబల్‌ బ్రాండ్లుగా పేరుగాంచిన వస్తువులన్నీ.. ఒకప్పుడు లోకల్‌ మాత్రమే అన్నారు. అయితే  ప్రజలు వాటికి మద్దతు ఇవ్వడంతో  ఆ బ్రాండ్లు గ్లోబల్‌గా మారుతాయన్నారు. అందుకే నేటి నుంచి ప్రతి భారతీయుడు లోకల్‌ బ్రాండ్లకు.. బ్రాండ్ అంబాసిడర్ గా మారాలన్నారు.  కరోనా వైరస్‌ మన జీవితంలో ఒక భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ మన జీవితాలను కరోనా వైరస్‌ చుట్టూ పరిమితం కానివ్వలేము అని అన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరం మాస్కులు కట్టుకుందాం.. ఆరు అడుగుల దూరం పాటిద్దామని ప్ర‌ధాని పిలుపునిచ్చారు.