వాహనదారులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి చమురు ధరలు. అసలే కరోనా కష్టకాలంలో.. ఈ పెట్రోల్ ధరలు మరింత భారంగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా 15వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా ఆదివారం పెట్రోల్ ధర లీటరుకు 35 పైసలు పెరుగగా, డీజిల్‌పై 56 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.23కి చేరగా, లీటర్ డీజిల్ ధర రూ.78.27కు ఎగబాకింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 12 వారాల షట్‌డౌన్ అనంతరం చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాగా ఇక జూన్ 9 నుంచి ఇప్పటివరకూ పెట్రోల్ ధర లీటర్‌పై రూ.8.03, డీజిల్‌పై 8.27 పెరిగింది.
ప్రముఖ నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు:
– హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ.82.25, డీజిల్ రూ.76.49
– అమరావతిలో పెట్రోల్ లీటర్ రూ.82.54, డీజిల్ రూ.76.79
– న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.79.23, డీజిల్ రూ.78.27
– ముంబైలో పెట్రోల్ లీటర్ రూ.86.05, డీజిల్ రూ.76.69
Read More:
బ్రేకింగ్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌కి కరోనా పాజిటివ్..
విపరీతంగా కరోనా కేసులు.. ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు: హైకోర్టు