పాక్‌లో కరోనా విలయ తాండవం.. లక్ష మార్క్‌ దాటేసింది..

| Edited By:

Jun 09, 2020 | 10:55 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే 72 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నాలుగు లక్షల మంది కరోనా బారినపడి మరణించారు.

పాక్‌లో కరోనా విలయ తాండవం.. లక్ష మార్క్‌ దాటేసింది..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే 72 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నాలుగు లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. ఇక ఈ వైరస్‌ మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా విజృంభిస్తోంది. మొన్నటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య అత్యల్పంగా నమోదైనప్పటికీ.. గత కొద్ది రోజులుగా కేసుల
సంఖ్య పెరుగుతోంది. తాజాగా లక్ష మార్క్‌ను దాటేసింది. సోమవారం నాడు కరోనా బారినపడి ఏకంగా 100 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 4646 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,08,317కి చేరింది. ఇక మరణాల సంఖ్య 2172కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి
కోలుకుని 35 వేల మందికి పైగా కోలుకున్నట్లు పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో పెరుగుతన్న కేసులు అత్యధికంగా పంజాబ్‌ ప్రావిన్స్‌లోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత సింధ్ ప్రావిన్స్‌లో నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.