Corona Death: కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు ఓవైపు వేల సంఖ్యలో చోటు చేసుకుంటున్న మరణాలు మరోవైపు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ధనిక, పేద.. తేడా అనే తేడా లేకుండా ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటోందీ మాయదారి రోగం. సెలబ్రిటీ హోదా ఉన్న సినీ తారలను సైతం ఈ వ్యాధి వదిలిపెట్టడం లేదు. తొలి వేవ్ సమయంలో బాల సుబ్రమణ్యం మరణంతో టాలీవుడ్‌లో మొదలైన విషాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా కారణంగా టాలీవుడ్‌లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ గాయకుడు నేరెడు కొమ్మ శ్రీనివాస్ కరోనాతో మరణిచారు. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ.. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాలో ‘దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జండా మనదే..’ పాట పాడిన వ్యక్తిగా శ్రీనివాస్ చాలా మందికి సుపరిచితం. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన శ్రీనివాస్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆరోగ్యం విషమించడంతో శ్రీనివాస్ మృతి చెందారు. శ్రీనివాస్ కేవలం సినిమా పాటలకే పరిమితం కాకుండా పలు దేశభక్తి పాటలు కూడా ఆలపించారు. ఈయన మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.
Also Read: RRR Movie: రికార్డు స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Hyderabad: యువతిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్.. సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు..