Omicron: డెల్టాకంటే 4 రేట్లు వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి.. రోగనిరోధక శక్తిని తట్టుకుని మరీ విజృభిస్తుందంటున్న ప్రొఫెసర్

|

Dec 09, 2021 | 8:09 PM

Omicron: కరోనా వైరస్ రెండేళ్ల నుంచి రోజుకో రూపంతో మానవాళిని భయపెడుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ సృష్టించిన విధ్వసం నుంచి ప్రపంచం...

Omicron:  డెల్టాకంటే 4 రేట్లు వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి.. రోగనిరోధక శక్తిని తట్టుకుని మరీ విజృభిస్తుందంటున్న ప్రొఫెసర్
Omicron
Follow us on

Omicron: కరోనా వైరస్ రెండేళ్ల నుంచి రోజుకో రూపంతో మానవాళిని భయపెడుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ సృష్టించిన విధ్వసం నుంచి ప్రపంచం బయటపడుతున్నది అనుకున్న వేళ దక్షిణాఫ్రికాలో సరికొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. నవంబర్ 24 న వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ క్రమక్రమంగా  ప్రపంచ దేశాలలో విస్తరిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా సహా ఇతర దేశాల శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ వ్యాప్తి, వ్యాధి తీవ్రత, లక్షణాలు, వ్యాక్సిన్ పనిచేసే తీరూపాయి పరిశోధనలు వేగవంతం చేశారు. అయితే తాజాగా ఒమిక్రాన్‌ పై జపాన్ కు చెందిన శాస్త్రవేతలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఒమిక్రాన్‌ ప్రారంభ దశలోనే డెల్టా వేరియంట్‌ కంటే 4.2 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తున్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ణిత సూత్రాల ఆధారంగా అంటువ్యాధుల వ్యాప్తి అంచనాలో నిపుణుడు.. క్యోటో విశ్వవిద్యాలయంలోని ఆ ఆరోగ్య, పర్యావరణ శాస్త్రాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిరోషి నిషియురా..  దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లోని  నవంబర్ 26 వరకు అందుబాటులో ఉన్న జన్యు డేటాను విశ్లేషించారు. ఈ మేరకు ఒమిక్రాన్‌ వ్యాప్తిపై సంచలన విషయాలను వెల్లడించారు.

Also Read:  ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మరణం గురించి ఏడాది క్రితమే హెచ్చరించిన గాయత్రి దేవి వాసుదేవ్.. ఫోటో వైరల్..