
విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో వసంతరావు అనే వృద్దుడు అదృశ్యం కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. వారం అయినా అతని ఆచూకీ ఇంకా లభించక పోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. దీంతో కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వసంతరావు అదృశ్యం అయ్యాడని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా వృద్ధుడు వసంతరావు భార్య ధనలక్ష్మి మాట్లాడుతూ.. నా భర్తకు బాగా ఆయాసం రావడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాం. వారు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని.. ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈనెల 24వ తేదీన ఆస్పత్రికి వెళ్లగా.. చాలా సేపు సిబ్బంది స్పందించ లేదు. చివరికి అందరనీ అడిగాక.. వీల్ చైర్ మీద లోపలకు పంపారు. పల్స్ పడిపోతున్నాయని, ఆక్సిజన్ పెట్టాలని చెప్పారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు అక్కడే ఉన్నాను. రాత్రికి నేను ఇంటికి వెళ్లాను.
25వ తేదీన ఉదయం ఆస్పత్రికి వెళ్లి చూస్తే నా భర్త కనిపించడం లేదు. డాక్టర్లకు ప్రశ్నిస్తే.. పారిపోయాడని చెబుతున్నారు. నడవలేని వ్యక్తి ఎలా పారిపోతాడు. నాలుగు రోజుల పాటు ఆస్పత్రి చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదు. పోలీసులు ఇంటికి వచ్చి అన్ని వివరాలు రాసుకెళ్లారు. వారం అయినా ఆచూకీ దొరకలేదు. అధికారులు వెతుకుతున్నామని చెబుతూనే ఉన్నారని వాపోయింది వృద్ధురాలు ధనలక్ష్మీ.
Read More:
సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. ధైర్యంగా ఉండండి: నవ్య స్వామి
27 అడుగులకే ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి మట్టితో..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..