
ఒడిషాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజు వందల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 18,757కి చేరింది. ఇక వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 12,909 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
647 new #COVID19 positive cases, 457 recovered in the last 24 hours in Odisha. The total number of positive cases in the state rises to 18,757 including 12,909 recovered: Health & Family Welfare Department, Government of Odisha
— ANI (@ANI) July 21, 2020
కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 37,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,55,171కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,02,529 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 7,24,578 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ
విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.