ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,672కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 34,805
మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 305 మంది మరణించారు. అన్‌లాక్ 1.0 అనంతరం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి.
ఇక దేశ వ్యాప్తంగా రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
1876 new #COVID19 positive cases, 1785 recoveries and 9 deaths have been reported in Odisha. Total number of cases now at 50672 including 15509 active cases, 34805 recoveries and 305 deaths: State Health Department
— ANI (@ANI) August 12, 2020
Read More :