అలర్ట్.. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోగులలో మరో కొత్త ఫంగస్‌.. మూడు నెలల్లో 4 కేసులు

|

Oct 13, 2021 | 9:56 AM

Covid-19: బ్లాక్‌ ఫంగస్‌ తర్వాత పూణెలోని నలుగురు కొవిడ్‌ పేషెంట్లలో వైద్యులు మరో కొత్తరకం ఫంగల్ ఇన్ఫెక్షన్‌ని గుర్తించారు. ఇది ఆరోగ్య నిపుణులలో ఆందోళను

అలర్ట్.. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోగులలో మరో కొత్త ఫంగస్‌.. మూడు నెలల్లో 4 కేసులు
New Fungus
Follow us on

Covid-19: బ్లాక్‌ ఫంగస్‌ తర్వాత పూణెలోని నలుగురు కొవిడ్‌ పేషెంట్లలో వైద్యులు మరో కొత్తరకం ఫంగల్ ఇన్ఫెక్షన్‌ని గుర్తించారు. ఇది ఆరోగ్య నిపుణులలో ఆందోళను పెంచుతోంది. వాస్తవానికి కోవిడ్ -19 నుంచి కోలుకున్న ఒక నెల తర్వాత ప్రభాకర్ అనే 66 ఏళ్ల రోగి తేలికపాటి జ్వరం, తీవ్రమైన వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరాడు. ప్రారంభంలో అతనికి కండరాల సడలింపుపై మందులు ఇచ్చారు కానీ ఇది అతనికి ఉపశమనం కలిగించలేదు. చికిత్స సమయంలో ఆ రోగి మాగ్నెట్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MII) స్కాన్ చేశారు.

అప్పుడు అతని శరీరంలో స్పాండిలోడిస్కిటిస్ అని పిలువబడే వెన్నెముక-డిస్క్ ప్రదేశాలలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ఎముక క్షీణించినట్లు గుర్తించారు. బయాప్సీ నివేదికలో అతని ఎముకలో ఆస్పర్‌గిల్లస్ జాతులు పెరుగుతున్నట్లు గుర్తించారు. నిజానికి ఇది ఒక రకమైన ఫంగస్. వైద్య పరంగా దీనిని ఆస్పెర్‌గిల్లస్ ఆస్టియోమైలిటిస్ అంటారు. ఈ ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వెన్నెముక క్షయ సోకుతుంది. కాబట్టి చికిత్స చేయడం చాలా కష్టం. కోవిడ్ నుంచి కోలుకున్న రోగులలో కొన్ని సందర్భాలలో ఊపిరితిత్తులలో ఈ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించారు. దీననాథ్ మంగేష్కర్ హాస్పిటల్ వైద్యుడు మాట్లాడుతూ.. “మేము ఈ ఫంగస్‌ను మూడు నెలల్లో నలుగురు రోగులలో చూశాం” అని చెప్పాడు.

కొవిడ్‌ చికిత్స సమయంలో స్టెరాయిడ్స్
ఈ కొత్త ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న నలుగురు పేషెంట్లు గతంలో తీవ్రమైన కొవిడ్, న్యుమోనియాతో బాధపడ్డారు. అందుకే కోలుకోవడానికి స్టెరాయిడ్‌లతో చికిత్స చేశారు. ఆ ఎఫెక్ట్‌ కూడా ఈ ఫంగస్‌ పెరగడానికి దారి తీసినట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే కొత్త ఫంగస్‌పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Andhra Pradesh Crime: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని ఓ కసాయి తనయుడు ఏం చేశాడంటే..