Nairobi Flies: మరో వైరస్ ముప్పు.. 7 వేల కిలోమీటర్లు దాటుకుని భారత్‌లోకి వచ్చిన పెను విపత్తు.. ఇప్పటికే 100మందికి..!

|

Jul 08, 2022 | 9:21 AM

కేరళలో టొమాటో ఫ్లూ ఆంత్రాక్స్ తర్వాత.. ఇప్పుడు సిక్కింలో నైరోబి ఫ్లై వ్యాప్తి పెరుగుతోందనే వార్తలు అందరిలో ఆందోళన పెంచుతున్నాయి. మరో రాష్ట్రానికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలో 100 మంది విద్యార్థుల్లో నైరోబీ ఫ్లైస్ ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దాంతో దేశవ్యాప్తంగా..

Nairobi Flies: మరో వైరస్ ముప్పు.. 7 వేల కిలోమీటర్లు దాటుకుని భారత్‌లోకి వచ్చిన పెను విపత్తు.. ఇప్పటికే 100మందికి..!
Nairobi Flies
Follow us on

Nairobi Flies: తూర్పు ఆఫ్రికా నుంచి భారత్‌లోకి పెను విపత్తు వచ్చి చేరింది.కరోనా నాల్గవ వేవ్ భయాల మధ్య ఇప్పుడు కొత్తరకం ఈగలు జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయి. కేరళలో టొమాటో ఫ్లూ ఆంత్రాక్స్ తర్వాత.. ఇప్పుడు సిక్కింలో నైరోబి ఫ్లై వ్యాప్తి పెరుగుతోందనే వార్తలు అందరిలో ఆందోళన పెంచుతున్నాయి. సిక్కింలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఇన్ఫెక్షన్ కేసు తెరపైకి రావడంతో కలకలం రేగింది. ఇప్పటివరకు అక్కడ 100 మంది విద్యార్థుల్లో నైరోబీ ఫ్లైస్ ఇన్ఫెక్షన్ వ్యాపించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రజలను ఈ ఈగలు గడగడలాడిస్తున్నాయి. అసలు ఇంతకు ఈ నైరోబీ ఫ్లై అంటే ఏంటీ.. వాటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌ ఎంటీ.. ఎలా వ్యాపిస్తుంది..ఎంత ప్రమాదకరమో తెలిస్తే వణికిపోతారు.

నైరోబీ ఫ్లై అంటే ఏమిటి?

ఆఫ్రికాకు చెందిన నైరోబీ ఈగల బారిన పడి వందలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు. నైరోబీ ఫ్లై ని కెన్యాన్ ఫ్లై లేదా డ్రాగన్ ఫ్లై అని కూడా అంటారు.ఇది రొయ్యల ఆకారంలో ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. నారింజ, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటుంది. సాధారణ ఈగలతో పోల్చితే.. పొడవుగా ఉంటాయి. ఇవి చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఈగలు మనుషులపై వాలితే విపరీతమైన మంట, నొప్పి ఉంటోందని బాధితులు చెబుతున్నారు. అంతేకాదు, జ్వరం రావడంతోపాటు వాంతులు కూడా అవుతున్నట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి

అవి మనుషులకు ఎలా సోకుతాయి? 

నైరోబీ ఈగలు మానవుల చర్మంపై వాలిన తర్వాత ఒక ప్రత్యేక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి.. ఈ రసాయనం పేరు పెడెరిన్ అని.. ఇది చర్మంపై పడిన వెంటనే మంట పుడుతున్న అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాత చర్మంగా ఎర్రగా మారి దద్దుర్లు వస్తాయని వివరించారు.. 48 గంటల తర్వాత చర్మంపై బొబ్బలు దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తాయి. చర్మంపై దద్దుర్లు రావడంతోపాటు ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడు సీరియస్ అవుతుంది?

ఈగ ఎక్కువ విషాన్ని (రసాయన) వ్యాపించి, అది శరీరం అంతటా వ్యాపించి ఉంటే, అప్పుడు జ్వరం, నరాల నొప్పి, కీళ్ల నొప్పులు,వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత చాలాసార్లు కళ్లను రుద్దితే విష రసాయనం కళ్లలోకి చేరి కండ్లకలకకు కారణమవుతుంది. ఈగ ఎక్కువ రసాయనాన్ని మనిషిపై చిమ్మితే ప్రాణానికి కూడా ప్రమాదమంటున్నారు వైద్య నిపుణులు.

ఎలా రక్షించుకోవాలి?

నైరోబీ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉదాహరణకు, దోమతెరలో నిద్రించండి. ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించటం. రాత్రిపూట తేలికపాటి ప్రదేశాలలో పడుకోవద్దు. ఈ ఫ్లై మీ చేతిపై కూర్చుంటే, బ్రష్ సహాయంతో దాన్ని తీసివేయండి. దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి..ఎందుకంటే, మీకు తెలియకుండా దాని విష రసాయనం చర్మంపై వ్యాపిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి