మొద్దు శ్రీను హంత‌కుడు అనారోగ్యంతో కాదు, క‌రోనాతోనే మృతి

| Edited By:

Jul 30, 2020 | 5:16 PM

ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన మొద్దు శ్రీనును చంపిన ఓం ప్ర‌కాష్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. గ‌త కొంత‌గాలంగా కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోన్న‌ ఓం ప్రకాష్‌ కేజీహెచ్‌లో చికిత్స్ పొందుతూ తుది శ్వాస విడిచాడు. ప‌రిటాల రవీంద్ర‌ హ‌త్య కేసు నిందితుడు మొద్దు శ్రీనును..

మొద్దు శ్రీను హంత‌కుడు అనారోగ్యంతో కాదు, క‌రోనాతోనే మృతి
Follow us on

ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన మొద్దు శ్రీనును చంపిన ఓం ప్ర‌కాష్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. గ‌త కొంత‌గాలంగా కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోన్న‌ ఓం ప్రకాష్‌ కేజీహెచ్‌లో చికిత్స్ పొందుతూ తుది శ్వాస విడిచాడు. ప‌రిటాల రవీంద్ర‌ హ‌త్య కేసు నిందితుడు మొద్దు శ్రీనును జైల్లోనే చంపాడు ఓం ప్రకాష్. 2016 నుంచి అత‌డు విశాఖ సెంట్ర‌ల్ జైల్లోనే శిక్ష అనుభ‌విస్తున్నాడు. అయితే ఓం ప్ర‌కాష్ చ‌నిపోయింది అనారోగ్యంతో కాద‌ట‌. క‌రోనా వైర‌స్ సోకి చ‌నిపోయిన‌ట్టు వైద్యులు తెలిపారు.

తాజాగా విశాఖ సెంట్ర‌ల్ జైల్‌లో కోవిడ్ క‌ల‌క‌లం చేల‌రేగిన సంగ‌తి తెలిసిందే. జైల్లో ఉన్న 10 మంది సిబ్బంది, 27 మంది జీవిత ఖైదీల‌కు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో వారికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అయితే మాజీ మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన మొద్దు శ్రీనును హ‌త్య చేసిన ఓం ప్ర‌కాష్‌కు కూడా క‌రోనా సోకింద‌ట‌. అనారోగ్య సమ‌స్య‌ల‌తో బాధ‌పడుతూ ఇటీవ‌ల ఓం ప్ర‌కాష్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృత‌దేహానికి క‌రోనా టెస్ట్ చేయ‌గా పాజిటివ్‌గా రిపోర్టు వ‌చ్చింది. అలాగే పాజిటివ్‌గా తేలిన ఖైదీల‌ను కూడా వైద్యుల సూచ‌న‌ల మేర‌కు క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు అధికారులు.

Read More: 

వాట్సాప్‌లో మ‌రో ఇంట్రెస్టింగ్ ఫీచ‌ర్‌! శాశ్వ‌తంగా నోటిఫికేష‌న్లు మ్యూట్ చేసేలా..