Surabhi Vanidevi: ఎమ్మెల్సీ వాణీదేవికి కరోనా పాజిటివ్.. ఏమని ట్విట్ చేశారంటే..?

|

Mar 28, 2021 | 11:39 PM

Covid-19 positive: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు

Surabhi Vanidevi: ఎమ్మెల్సీ వాణీదేవికి కరోనా పాజిటివ్.. ఏమని ట్విట్ చేశారంటే..?
Surabhi Vanidevi
Follow us on

Covid-19 positive: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణలో మరో ఎమ్మెల్సీకి కరోనా సోకింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వాణీదేవి కోరారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినందున.. తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ ఉండాలని.. అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి వాణీదేవి కోరారు. ఇటీవల ఆమె హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై గెలుపొందారు.

Also Read: