ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు కట్.. ట్రంప్ తీరుపై బిల్ గేట్స్ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Apr 15, 2020 | 7:53 PM

కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు కట్.. ట్రంప్ తీరుపై బిల్ గేట్స్ ఫైర్
Follow us on

కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంస్థకు మునుపటికన్నా ఇప్పుడు నిధుల అవసరం చాలా ఎక్కువగా ఉందని అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా పట్ల పక్షపాతం చూపుతోందని, తప్పుడు సమాచారం ఇస్తోందని, ఆ సంస్థ వైఖరి కారణంగా కరోనా కేసులు 20 రెట్లు పెరిగిపోయాయని ట్రంప్ ఇటీవల ఆరోపించారు. అందువల్ల ఆ సంస్థకు నిధుల విడుదలను నిలిపివేస్తున్నామన్నారు. అయితే వరల్డ్ హెల్త్ క్రైసిస్ ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ఇలా చేయడం తగదని ట్రంప్ ను తప్పు పడుతూ బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న పని నిలిచిపోతే మరే ఇతర సంస్ధ కూడా ఆ పని చేయజాలదన్నారు. ప్రస్తుతం ప్రపంచానికి ఈ సంస్థ అవసరం మునుపటికన్నా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కాగా… ట్రంప్ చేసిన ఆరోపణలను ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్స్ కూడా  ఖండిస్తూ..నిధుల నిలిపివేతకు ఇది సమయం కాదన్నారు.

ఇలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇప్పటికే లక్షా 25 వేల మందిని పొట్టన బెట్టుకుంది. సుమారు 20 లక్షల మందికి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకింది.