
బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా సోకడంతో.. బాలీవుడ్ సహా, దేశం మొత్తం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడ్డ అమితాబ్ బచ్చన్ (77)కు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ మేరకు ట్వీట్టర్‌లో ట్వీట్ చేస్తూ ‘అమితాబ్ జీ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని’ చిరంజీవి ఆకాంక్షించారు. కాగా తనకు కోవిడ్ నిర్థారణ అయిందని అమితాబ్ శనివారం సాయంత్రం ట్వీట్టర్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే కదా. మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కోవిడ్ కేసులు నిర్వహించారు వైద్యులు. అమితాబ్ భార్య జయ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్యకి కూడా టెస్టులు చేయగా.. వారికి కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలాగే బిగ్‌బీ, అభిషేక్‌లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా అబితాబ్ త్వరగా కోలుకోవాలని దేశం మొత్తం ప్రార్థిస్తుందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. కాగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలోని రెస్పీ రేటరీ ఐసోలేషన్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న అమితాబ్, అభిషేక్‌ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు ప్రకటించారు. తమ అభిమాన నటులు కోవిడ్ నుంచి క్షేమంగా బయటపడాలని దేశ వ్యాప్తంగా వారి అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు ప్రముఖులు ట్వీట్లలో సంఘీభావం తెలుపుతున్నారు.
All our best wishes and hearty prayers are with you Amit ji! @SrBachchan Get well Soon! https://t.co/WsmqTw7y9t
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2020