కరోనా గురించి మెగా ఫ్యామిలీ వినూత్న సందేశం.. ఏమన్నా చేశారా?

| Edited By:

Apr 15, 2020 | 5:26 PM

'స్టే హోమ్.. ఇంట్లోనే ఉంటాం..యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు.. ప్రేమను పంచుదాం. కాలు కదపకుండా.. కరోనాను తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై.. భారత్‌ను గెలిపిస్తాం. స్టే సేఫ్..' అంటూ..

కరోనా గురించి మెగా ఫ్యామిలీ వినూత్న సందేశం.. ఏమన్నా చేశారా?
Follow us on

కరోనా వైరస్ గురించి మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు, ప్రజలకు సందేశాలు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ లేని కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ” ఏర్పాటు చేసి, తన వంతుగా విరాళం కూడా అందజేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కోటి, నాగ్‌, చిరు ఫ్యామిలీ కలిసి కరోనా కట్టడి కోసం ఓ సాంగ్ కూడా పాడారు. తాజాగా కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన పెంచే విధంగా మరో వినూత్న సందేశమిచ్చారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటై.. ప్లకార్డులు పట్టి.. కరోనా గురించి ఓ మెసేజ్ ఇచ్చారు.

‘స్టే హోమ్.. ఇంట్లోనే ఉంటాం..యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు.. ప్రేమను పంచుదాం. కాలు కదపకుండా.. కరోనాను తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై.. భారత్‌ను గెలిపిస్తాం. స్టే సేఫ్’ అంటూ మెగా స్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయి ధరమ్ తేజ్, శ్రీజ దంపతులు, వైష్ణవ్ తేజ్‌లు కలిసి డ్రాయింగ్ చేసిన ప్లకార్డులు పట్టుకుని ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక ఈ ఫొటోకు నెటిజన్లు ట్రోల్ చేస్తూ.. ఏమన్నా చేశారా, ఐడియా బలేగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Learn More:

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై పోలీసు కేసు

లాక్‌డౌన్‌లో అదే పని.. పోర్న్ చూడటంలో భారత్ ఫస్ట్ ప్లేస్

బ్రేకింగ్: వికారాబాద్‌లో వారం రోజుల పాటు సకలం బంద్.. కలెక్టర్‌ సంచలన నిర్ణయం

కరోనా కట్టడి: జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారులు వీళ్లే