Buddhadeb Bhattacharya admitted to hospital : సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (77) ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 18నే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా, ఆసుపత్రిలో చేరేందుకు భట్టాచార్య అంగీకరించలేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన కోల్ కతాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం ఆయన ఆక్సిజన్ స్థాయిలు 90 శాతం కంటే దిగువకు పడిపోవడంతో మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, బుద్ధదేవ్ దాదాపు పదేళ్లుగా క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ)తో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఎక్కువ సమయం ఇంటికే పరిమితం అయ్యారు. కాగా, భట్టాచార్య అర్ధాంగి మీరా కూడా కరోనా బారినపడ్డారు. ఆమె ఈనెల 18వ తేదీన దక్షిణ కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందిన అనంతరం కోలుకొని నిన్ననే డిశ్చార్జి అయ్యారు.
Former #Bengal CM Buddhadeb Bhattacharya shifted to a private hospital in #Kolkata as a measure of abundant precaution ahead of #CycloneYaas pic.twitter.com/BJZfffFBoW
— Indrajit | ইন্দ্রজিৎ – কলকাতা (@iindrojit) May 25, 2021