
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా యావత్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్త దెబ్బతింది. అంతేకాదు.. అందరి ప్లాన్స్ అట్టర్ ప్లాఫ్ అయ్యాయి. ప్రస్తుం ఈ కరోనా నుంచి ప్రపంచమంతా ఎప్పుడు జయిస్తుందోనని ఎదురుచూస్తోంది. ఇక మన దేశంలో కూడా కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అందరి ఇళ్లల్లో శుభకార్యాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో.. ఆ సమయంలో జరగాల్సిన పెళ్లిళ్లన్నీ ఆగిపోయాయి. అన్ని రాష్ట్రాల్లో ఇదే సీన్ ఉంది. అయితే లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఇక శుభకార్యాలు కంటిన్యూగా కానున్నాయి. వివాహాలు కూడా అలానే కానున్నాయి.
అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఇక ఇక్కడ లాక్‌డౌన్ గడువు ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్ మ్యారేజ్‌లు ఎక్కువ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వివాహ నమోదు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను జారీ చేసింది. ముంబై రిజిస్టార్ కార్యాలయానికి వివాహం చేసుకునేందుకు వచ్చే జంటలు.. వారి వెంట ఖచ్చితంగా పెన్ను తెచ్చుకోవాలని సూచించింది. అంతేకాదు వివాహ సమయంలో కేవలం ఐదుగురు మాత్రమే ఉండేలా చూసుకోవాలని తెలిపింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాతే.. వివాహ నమోదు ప్రారంభమవుతుందని.. నూతన నిబంధనల ప్రకారం కొత్త జంటలు.. ఫోటో తీసుకునేందుకు కొన్ని నిముషాలపాటు మాస్కులు తొలగించడానికి అనుమతివ్వనున్నట్లు తెలిపారు.