పది కాదు నాలుగు మాత్రమే.. రెడ్ జోన్ల లిస్టుపై దీదీ ఫైర్..

|

May 01, 2020 | 9:58 PM

కరోనా పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఉన్న జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో రెడ్ జోన్‌లు, కోవిడ్‌ 19 హాట్ స్పాట్స్ లిస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. మీ రెడ్ జోన్ల లిస్టులో తప్పులున్నాయంటూ దీదీ కొత్త జాబితాను కేంద్రానికి పంపించారు. ఇక ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వివేక్ కుమార్ కేంద్ర హెల్త్ సెక్రటరీకి […]

పది కాదు నాలుగు మాత్రమే.. రెడ్ జోన్ల లిస్టుపై దీదీ ఫైర్..
Follow us on

కరోనా పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఉన్న జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో రెడ్ జోన్‌లు, కోవిడ్‌ 19 హాట్ స్పాట్స్ లిస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. మీ రెడ్ జోన్ల లిస్టులో తప్పులున్నాయంటూ దీదీ కొత్త జాబితాను కేంద్రానికి పంపించారు.

ఇక ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వివేక్ కుమార్ కేంద్ర హెల్త్ సెక్రటరీకి వివరణ ఇస్తూ ఓ లెటర్‌ను రాశారు. ”బెంగాల్‌లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితాకు సంబంధించి తప్పులున్నాయని.. రాష్ట్రంలో దాదాపు 10 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నట్లు ప్రకటించారని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితులు, కరోనా కేసులు బట్టి రాష్ట్రంలో కేవలం 4 జిల్లాలు మాత్రమే రెడ్ జోన్‌లో ఉన్నాయని.. అవి కూడా కలకత్తా, హౌరా, నార్త్-24 పరగణాస్, పూరబ్ మెదినీపూర్‌ అని వివేక్ కుమార్ లెటర్‌లో పేర్కొన్నారు.

Read This: లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..