Covid 19 Vaccination: వ్యాక్సిన్‌ తీసుకోకుంటే జీతం కట్‌.. ఈ వినూత్న నిర్ణయాన్ని ఎక్కడ తీసుకున్నారో తెలుసా.?

Covid 19 Vaccination: ప్రపంచాన్ని భయపెట్టించిన కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా భారత్‌లో..

Covid 19 Vaccination: వ్యాక్సిన్‌ తీసుకోకుంటే జీతం కట్‌.. ఈ వినూత్న నిర్ణయాన్ని ఎక్కడ తీసుకున్నారో తెలుసా.?
Vaccination Process

Updated on: Nov 09, 2021 | 6:15 PM

Covid 19 Vaccination: ప్రపంచాన్ని భయపెట్టించిన కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. వంద కోట్లకు పైగా డోస్‌లతో భారత్‌ ప్రపంచదేశాలకే సవాల్‌ విసురుతోంది. ఇక కేంద్రం ప్రభుత్వం కూడా ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తుండడంతో అందరూ వ్యాక్సిన్‌ కోసం మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటికీ కొంత మంది అనుమానాలతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు దూరమవుతున్నారు. అధికారుల ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ, ప్రకటనలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తోన్నా కొందరు దూరంగా ఉంటున్నారు.

అయితే ఇప్పటికే కొన్ని దేవాలయాలతో పాటు పలు ప్రదేశాల్లో రెండు డోస్‌లు వ్యాక్సిన్‌లు తీసుకుంటూనే అనుమతిస్తామంటూ కఠినంగా ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. అయినా కొందరు మాత్రం వ్యాక్సిన్‌ తీసుకోవట్లేదు. ఇలాంటి సమస్యే మహారాష్ట్రాలోని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో (టీఎంసీ) కూడా ఎదురైంది. ఉద్యోగులు వ్యాక్సినేషన్‌కు సహకరించకపోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగి ఎవరైనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే వారికి జీతం నిలిపి వేస్తామని ఆదేశాలు జారీ చేశారు. కనీసం సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ డోస్‌ అయినా వేసుకుంటేనే జీతం ఇస్తామని తేల్చి చెప్పారు.

ఇక సింగిల్‌ డోస్‌ తీసుకొని రెండో డోస్‌ వ్యవధి ముగిసిన వారికి కూడా జీతం అందించమని స్పష్టం చేశారు. ఉద్యోగులు కచ్చితంగా వ్యాక్సినేషన్‌ పూర్తయిన సర్టిఫికేట్లను చూపించాలని ఆదేశించారు. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పెంచే క్రమంలో నగర పరిధిలో వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నేటి నుంచి ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

Also Read: AP CM Jagan Odisha Tour: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సీఎం వైఎస్ జగన్‌ భేటీ

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి ఈఎంఐ పద్దతిలో టికెట్లు

T20 World Cup 2021: ఆ దేశ ఆటగాళ్లు రాణిస్తున్నారు.. ఆ జట్టుకే కప్ గెలిచే సత్తా ఉంది..