మహారాష్ట్రలో భయం.. భయం.. 24 గంటల్లో111 మందిని బలి తీసుకున్న కరోనా.. ఒక్కరోజే 35,952 కొత్త కేసులు..

|

Mar 26, 2021 | 3:44 AM

Covid-19: మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రంలోగా 111 మంది కరోనా..

మహారాష్ట్రలో భయం.. భయం.. 24 గంటల్లో111 మందిని బలి తీసుకున్న కరోనా.. ఒక్కరోజే 35,952 కొత్త కేసులు..
Covid 19
Follow us on

మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రంలోగా 111 మంది కరోనా వైరస్ ప్రభావంతో మృతి చెందారు. వైరస్‌ శరవేగంగా విస్తరిస్తుండటంతో మహా జనం వణికిపోతున్నారు.

రోజురోజుకూ భారీ సంఖ్యలో నమోదవుతున్న కొత్త కేసులు గత రికార్డులను బ్రేక్‌ చేస్తున్నాయి. గురువారం ఒక్కరోజే దాదాపు 36వేల కొత్త కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత గతంలో ఎన్నడూలేనంత స్థాయిలో 24గంటల్లోనే 35,952 కొత్త కేసులు, 111 మరణాలు వెలుగుచూశాయి.

అదే సమయంలో 20,444 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,88,78,754 శాంపిల్స్‌ పరీక్షించగా.. 26,00,833 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 22,83,037మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 53,795మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,62,685 క్రియాశీల కేసులు ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదే కోవిడ్  రిపోర్ట్…

ఇవి కూడా చదవండి: Jagananna Vidya Deevena: తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన డబ్బులు పడేది అప్పుడే.. సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం… ఏప్రిల్ 6న నిధుల విడుదల