COVID-19: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. పెరుగుతున్న మరణాల సంఖ్య..

|

May 20, 2021 | 10:46 PM

Maharashtra Coronavirus cases: దేశంలో కరోనాసెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ మూడు లక్షల కొత్త కేసులు, నాలుగు వేల మరణాలు నమోదవుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం,

COVID-19: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. పెరుగుతున్న మరణాల సంఖ్య..
Maharashtra COVID-19 cases
Follow us on

Maharashtra Coronavirus cases: దేశంలో కరోనాసెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ మూడు లక్షల కొత్త కేసులు, నాలుగు వేల మరణాలు నమోదవుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కేసులు, మరణాల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. కాగా.. దేశంలో కరోనా ప్రారంభం నాటినుంచి కేసులు, మరణాల పరంగా మొదటిస్థానంలో నిలిచిన మహారాష్ట్రలో మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది. ఇటీవల భారీగా పెరిగిన కేసులు కాస్త.. కొంతమేర తగ్గుముఖం పడుతున్నాయి.

గత 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 29,911 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 738 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో మొత్తం కేసుల సంఖ్య 54,97,448 కి పెరగగా.. మరణాల సంఖ్య 85,355 కి పెరిగింది. ఈ మేరకు మహరాష్ట్ర ఆరోగ్యశాఖ గురువారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. కరోనా నుంచి గత 24 గంటల్లో 47,371 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 50,26,308 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,83,253 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కాగా.. మహారాష్ట్రలో అత్యధికంగా ముంబై మహానగరం, పూణే పట్టణంలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ముంబైలో 1425 కేసులు నమోదు కాగా.. 59 మంది మరణించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకొని నియంత్రణకు కృషిచేస్తోంది.

Also Read:

కోవిద్ తో తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలకు రూ. 1500 సాయం, పంజాబ్ ప్రభుత్వ ప్రకటన, 21 ఏళ్ళ వరకు వెసులుబాటు

Israel Palestine Crisis: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. ఎందుకంటే..!